Switch to English

‘ప్రేమదేశపు యువరాణి’ సాంగ్‌ లాంచ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,713FansLike
57,764FollowersFollow

పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులు. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘మసకతడి’ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోపాటను ఆవిష్కరించారు. ‘నిశబ్దం’ అంటూ సాగే పాటను జనసేన పార్టీ స్పోక్స్‌ పర్సన్‌ రాయపాటి అరుణ చేతుల మీదుగా విడుదల చేశారు. అజయ్‌ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ పాటను సునీత ఆలపించారు. చిత్ర దర్శకుడే ఈ పాటను రాయడం విశేషం. పాటను విడుదల చేసిన అనంతరం రాయపాటి అరుణ చిత్రం బృందానికి శుభాకాంక్షలు తెలిపి, సినిమా సక్సెస్‌ కావాలని అభిలషించారు. పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ఇది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే బాండింగ్‌తో సినిమా జ్ఞాపకాలను ఇంటికి తీసుకెళ్తారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. రాయపాటి అరుణగారు లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అలాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

Renu Desai: ‘యానిమల్’ పై రేణూ దేశాయ్ పోస్ట్.. కామెంట్స్ సెక్షన్...

Renu Desai: రణబీర్  కపూర్ (Ranbir Kapoor)-రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’...

Manchu Manoj : ఇన్నాళ్లు నాన్నకి ఇప్పుడు నా భార్యకి..!

Manchu Manoj : మంచు మనోజ్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకే సారి ఓటీటీ మరియు థియేటర్ ద్వారా మనోజ్...

Hi Nanna : నాని VS నితిన్‌.. ప్రీ రిలీజ్ లో...

Hi Nanna : క్రిస్మస్‌ కి రావాలి అనుకున్న నాని హాయ్‌ నాన్న మరియు నితిన్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు సలార్‌ కారణంగా రెండు వారాలు...

Manchu Manoj : ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన మంచు హీరో

Manchu Manoj : మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు మరియు మంచు మనోజ్ లు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మంచు...

రాజకీయం

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ముఖ్యమంత్రుల్ని తయారు చేస్తున్న చంచల్‌గూడా జైలు.!

తెలంగాణలో ఆ జైలుకి ఓ ప్రత్యేకత వుంది. ప్రముఖ కారాగారం అయిన చంచల్‌గూడా, రాజకీయ నిందితులు, నేరస్తులకు కేరాఫ్ అడ్రస్.. అని అంటుంటారు.! నిందితులందరూ నేరస్తులు కాకపోవచ్చనుకోండి.. అది వేరే సంగతి.! అసలు విషయానికొస్తే,...

ఓడిపోయిన జనసేన.! పారిపోయిన వైసీపీ, వైటీపీ.! ఏది పెద్ద అవమానం.!

కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు.. నాయకులూ పోటీకి ‘సై’ అన్నారు.! అధినేత పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్ ఇంకేముంటుంది.? కార్యకర్తలు, నాయకుల కోరికని మన్నించాలి కదా.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిందదే.! ఎన్నికల ప్రచారంలో జనసేన...

Revanth Reddy: రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుందా.? ముంచేస్తుందా.?

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డీకే శివకుమార్ ఏమయ్యారు.? డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి, తెలంగాణలో ఏం జరగబోతోంది.? పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కాంగ్రెస్...

రేవంత్ కే పట్టం: ఈ రాత్రికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

అందరూ ఊహించిన విధంగానే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ ని అప్పగించింది. సోమవారం రాత్రి 7 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై...

ఎక్కువ చదివినవి

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటు వేసిన సినీ సెలబ్రిటీలు

Telangana Elections: తెలంగాణ (Telangana assembly elections) రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకన్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సతీమణి సురేఖ, చిన్న కుమార్తె శ్రీజ,...

Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్, ఏపీలో భారీ వర్షాలు

Cyclone Michaung: మిగ్ జాం తుపాను (Cyclone Michaung)  తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దీంతో వాతావరణ శాఖ కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 01 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:17 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ చవితి మ.3:07 ని.వరకు తదుపరి కార్తీక బహుళ పంచమి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: పునర్వసు సా.5:06 ని.వరకు...

Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. సంతోషంగా ఉందంటూ అట్లీ పోస్ట్

Atlee: తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటించిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు...

ఒక్క హీరోయిన్ ఏ కష్టమంటే… ఇక్కడ ఐదుగురు హీరోయిన్లట!!

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం దర్శకులకు తలకు మించిన భారమవుతోంది. సీనియర్ హీరోయిన్లు పెద్దగా ఫామ్ లో లేకపోవడం, ఉన్నవాళ్ళని మళ్ళీ రిపీట్ చేయలేకపోవడం వీటికి కొన్ని కారణాలు. అసలు ఒక్క...