బాహుబలి సినిమా విడుదల తరువాత దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ఆ సినిమా తరువాత చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహో. ఈ చిత్రాన్ని దేశం లో వివిధ భాషల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం సాహో షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ హిందీ నేర్చుకుంటున్నాడట. ఓ హిందీ టీచర్ దగ్గర ప్రభాస్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు ఓ ప్రముఖ పత్రికతో తెలిపారు.
హిందీ నా తొలి భాష కాదు. కాబట్టి చాలా సాధన చేస్తున్నా. నేను హిందీ రాయగలను, మాట్లాడగలను. కానీ ఇంట్లో హిందీలో మాట్లాడుకోం.ప్రస్తుతం హిందీ నేర్చుకోవడానికి చాల హోం వర్క్ చేస్తున్నానని , నెల రోజుల నుండి హిందీ టీచర్ దగ్గర డైలాగ్ క్లాసులు తీసుకుంటున్నానని చెప్పారు. మొదటి షెడ్యూల్ లో హిందీ లో డైలాగ్ లు చెప్పడం కష్టమైన రెండవ షెడ్యూల్ లో హిందీ లో డైలాగ్ లు చెప్పడం కాస్త తేలికైంది అని చెప్పుకొచ్చారు.
ఇక హిందీ సాహో చిత్రానికి ప్రభాస్ తన సొంత డబ్బింగ్ చెప్పుకోబుతున్నాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు సాహో నిర్మాతలు ..