Switch to English

కర్నూలు పర్యటనలో పవన్‌: పోటెత్తిన జనసైనికులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

కర్నూలు జిల్లా నంద్యాల సిట్టింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఎస్పీవై రెడ్డి, జనసేన తరఫున నంద్యాల నుంచే మరోసారి ఎంపీగా బరిలోకి దిగారు.. అదీ జనసేన అభ్యర్థిగా. జనసేన పార్టీలో ఎస్పీవై రెడ్డి చేరికతో, కర్నూలు జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వచ్చిందని అప్పట్లో పార్టీ శ్రేణులు భావించాయి. పోలింగ్‌ తర్వాత, ఎస్పీవై రెడ్డి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కర్నూలు వెళ్ళారు పవన్‌కళ్యాణ్‌. పవన్‌ కళ్యాణ్‌ కర్నూలు టూర్‌కి జనసైనికులు పోటెత్తారు. ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద ఘన నివాళులర్పించిన జనసేనాని పవన్‌కళ్యాణ్‌, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఎస్పీవై రెడ్డి కుమార్తెతోపాటు, అల్లుడితో పవన్‌ మాట్లాడారు. విదేశీ పర్యటనలో వుండడం వల్ల ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినట్లు పవన్‌కళ్యాణ్‌, వారికి తెలిపారు.

ఇదిలా వుంటే, నంద్యాల పార్లమెంటు పరిధిలో ఎస్పీవై రెడ్డి కుటుంబానికి వున్న మంచి ఇమేజ్‌ కారణంగా కొంత ఆందోళనకు గురైన టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తాం..’ అంటూ ప్రకటించినా, ఎస్పీవై కుటుంబం లైట్‌ తీసుకుంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎస్పీవై రెడ్డి నంద్యాల ఎంపీగా గెలుపొందారు. అయితే, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ తీరు నచ్చక, వెంటనే వైసీపీకి గుడ్‌ బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరారు.

మరోపక్క, తాజా ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు చివరి నిమిషం వరకు సీటు ఖరారు చేయకుండా, ఎస్పీవై రెడ్డినీ, ఆయన కుటుంబాన్నీ అవమానపర్చారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీవై రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకుని, జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం నంద్యాల పార్లమెంటు పరిధిలో జనసేన ఓటు బ్యాంకు గణనీయంగానే వుండబోతోందనీ, పవన్‌కళ్యాణ్‌కి వున్న ఇమేజ్‌కి ఎస్పీవై రెడ్డి ఫాలోవర్స్‌ అదనంగా తోడయ్యారని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా, పవన్‌కళ్యాణ్‌ పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లా జనసేన పార్టీ వర్గాల్లో జోష్‌ కన్పించింది. అయితే, వచ్చింది పరామర్శ కోసం గనుక పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలంటూ పదే పదే జనసైనికులకు జనసేనాని హితబోధ చేశారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...