Switch to English

Ponniyin Selvan 2 Review: పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow
Movie పొన్నియిన్ సెల్వన్ 2
Star Cast విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష
Director మణిరత్నం
Producer మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
Music AR రెహమాన్
Run Time 2గం 44ని
Release 28 ఏప్రిల్ 2023

Ponniyin Selvan 2 Review:మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2. సాధారణంగా సీక్వెల్ కు ఉండాల్సిన హైప్ ఈ చిత్రానికి లేకపోవడం ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. అయితే భారీ తారాగణం, భారీ బడ్జెట్, ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ చిత్రం మొదలవుతుంది. బౌద్ధులు, వల్లవరాయ కలిసి అరుణ్ మొళిని కాపాడతారు. మరోవైపు నందిని, పాండ్యులు కలిసి వీరపాండ్యన్ చావుకి ఆదిత్యుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఇంకోవైపు మధురాంతకుడు, శైవులు కలిసి చోళ సింహాసనంపై కన్నేస్తారు. ఈ నేపథ్యంలో ఆదిత్య కరికాలుడికి, నందినికి ఏమవుతుంది? మధురాంతకుడి సింహాసన కోరిక తీరుతుందా?

నటీనటులు:

ఈ చిత్రంలో ఎంతో మంది పేరున్న నటీనటులు నటించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, నాజర్, ప్రభు, ప్రకాష్ రాజ్, శోభిత మొదలగు వారు కీలక పాత్రలు పోషించారు. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలను నూరు శాతం కమిట్మెంట్ తో పోషించారని చెప్పాలి.

సాంకేతిక నిపుణులు:

ఈ చిత్రాన్ని చాలా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. మణిరత్నం చోళుల కథను గ్రాండ్ గా తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే మొదటి పార్ట్ కు ఉన్న ఇబ్బందే రెండో భాగానికి కూడా ఉంది. డ్రామాలో హై పాయింట్స్ మిస్ అవ్వడం పెద్ద మైనస్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కు హిస్టారికల్ డ్రామా చూస్తున్నప్పుడు కావాల్సిన కమర్షియల్ హై పాయింట్స్ ఈ చిత్రంలో లేకపోవడం పెద్ద ప్రతికూలత. దీనికి తోడు నరేషన్ చాలా నెమ్మదిగా నడిచింది. ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అయ్యే అవకాశాలున్నాయి.

ఏఆర్ రహ్మాన్ అందించిన సంగీతం పర్వాలేదు. అంత గొప్పగానూ లేవు అలాగే బ్యాడ్ అని కూడా అనలేం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. డ్రామాకు తగ్గట్లుగానే అలా సాగిపోయింది. సినిమాటోగ్రఫీ వర్క్ ను అయితే మెచ్చుకోకుండా ఉండలేం. అలాగే సిజిఐ కూడా.

పాజిటివ్ పాయింట్స్:

  • నటీనటులు
  • సినిమాటోగ్రఫీ
  • కథ

నెగటివ్ పాయింట్స్;

  • స్లో నరేషన్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • హై మూమెంట్స్ లేకపోవడం
  • క్లైమాక్స్

విశ్లేషణ:

పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం మీకు ఎలా అనిపించిందో రెండో భాగం కూడా అలానే అనిపిస్తుంది. అది నచ్చితే ఇది కూడా నచ్చే అవకాశాలున్నాయి. లేదంటే లేదు. సినిమాటోగ్రఫీ, పెర్ఫార్మన్స్ లు పోజిటివ్స్ కాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గూస్ బంప్ మూమెంట్స్ లేకపోవడం నెగటివ్ పాయింట్స్. పీఎస్ 1 నచ్చితే దీనిపై కూడా ఓ లుక్కేయండి. లేదంటే ఈజీగా స్కిప్ కొట్టేయొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...