నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ని రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి ఆరోపణలను వైకాపా నాయకులు మరియు మంత్రులు కొట్టి పారేస్తున్నారు.
ప్రభుత్వానికి ఎవరి ఫోన్స్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాక్షాదారాలతో సహా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటూ నిరూపించారు. వాటికి మాత్రం వైకాపా నాయకుల వద్ద సమాధానం లేదు.
కోటంరెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేందుకే ఇలా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నాడని, ఆయనకు జగన్ ఎంతో మద్దతుగా నిలిచిన కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నాడని వైకాపా శ్రేణులు విమర్శలు చేస్తున్నారు.
పార్టీ మారితే పర్వాలేదు కానీ ఇలా బురద జల్లడం మంచిది కాదని కోటంరెడ్డిని వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు. ఇంతకు ఫోన్ ట్యాపింగ్ అయ్యిందా లేదా అనే విషయాన్ని మాత్రం వారు అధికారికంగా క్లారిటీ ఇవ్వడం లేదు. కోటంరెడ్డి మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బల్లగుద్ది మరి చెబుతున్నాడు. అసలు సంగతి ఏంటి అనేది జగన్ మోహనుడికే తెలియాలి.