గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు పరశురామ్ తదుపరి సినిమా కోసం కాస్త ఎక్కువ గ్యాప్ ను తీసుకున్నాడు. గీత గోవిందం సినిమా తర్వాత నాలుగు ఏళ్లకు మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు పరశురామ్ వచ్చాడు.
సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన వెంటనే నాగ చైతన్య హీరోగా పరశురామ్ సినిమా మొదలు పెట్టాలి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఓకే చెప్పినట్లే చెప్పి నాగ చైతన్య హ్యాండ్ ఇవ్వడంతో పరశురామ్ తదుపరి సినిమా విషయంలో సందిగ్దం నెలకొంది. నాగ చైతన్య సినిమా క్యాన్సిల్ అవ్వడంతో దర్శకుడు పరశురామ్ గీత గోవిందం సినిమా యొక్క సీక్వెల్ వర్క్ ను మొదలు పెట్టాడు అనే వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధం అయ్యింది.. దానికి అల్లు అరవింద్.. బన్నీ వాసు లు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్ లో నటించేందుకు విజయ్ దేవరకొండ మరియు రష్మిక రెడీగానే ఉన్నారట.
కనుక ఆలస్యం చేయకుండా గీత గోవిందం సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా గీతా ఆర్ట్స్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గీత గోవిందం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కనుక యూత్ ఆడియన్స్ లో గీత గోవిందం సీక్వెల్ కి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి.