ఏ హీరోయిన్ కైనా డెబ్యూ సినిమాతో రాని క్రేజ్ పాయల్ రాజ్ పుత్ కు ఆరెక్స్ 100 సినిమాతో వచ్చింది. హీరోయిన్ సెంట్రిక్ క్యారెక్టర్… పైగా ఆమె బోల్డ్ నెస్ తో యువతను కట్టిపడేసింది. పాయల్ ఈ చిత్రంలో బోల్డ్ గా కనిపించినా కానీ దానికి మించిన బలమైన కథ ఇందులో ఉండడంతో ఆమెపై నెగటివిటీ రాలేదు సరికదా దానికి రెట్టింపు క్రేజ్ వచ్చింది. అయితే ఇండస్ట్రీలో క్రేజ్ రావడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే పాయల్ ఈ విషయంలోనే తడబడింది. తన ఇమేజ్ ను తానే చేజేతులా నాశనం చేసుకుంది.
బోల్డ్ క్యారెక్టర్ ద్వారా పరిచయమైన పాయల్ దాన్నుండి బయటపడాలని చూడకుండా తర్వాత సీత సినిమాలో ఒక హాట్ ఐటెం సాంగ్ చేయడం, దాని తర్వాత ఆర్డిఎక్స్ లవ్ అంటూ మరో బోల్డ్ అటెంప్ట్ చేయడం మైనస్ గా మారింది. ముఖ్యంగా ఆర్డీఎక్స్ లవ్, పాయల్ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసింది. ఆమె పోషించిన పాత్రను బోల్డ్ నెస్ పేరుతో దిగజారుడుగా చూపించడంతో పాయల్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
అయితే వెంకీ మామ వంటి సినిమాలో ముందే ఛాన్స్ రావడం కొంత ప్లస్ అయింది. ఆర్డీఎక్స్ లవ్ సినిమాతోనే పాయల్ కు ఒకలాంటి ఇమేజ్ క్రియేట్ అయింది. వెంకీ మామలో నటించినా కానీ ఇంకా పాయల్ ను సాధారణ హీరోయిన్ గా చూడట్లేదు జనాలు. ఆ చిత్రంలో పాయల్ మరీ హైలైట్ కాకపోవడం కూడా ఇందుకు ఒక కారణమనుకోవచ్చు. పాయల్ చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ డిస్కో రాజా. ఇందులో రవితేజ డామినేషన్ ప్రధానంగా ఉంటుంది. కాదంటే నభ నటేష్ మరో హీరోయిన్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ ను పూర్తిగా డామినేట్ చేసేసిన నభకు పాయల్ ను డామినేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అంతా అయిపోయాక ఇప్పుడు జాగ్రత్త పడాలనుకుంటోంది పాయల్.
ఇకపై తాను బోల్డ్ సినిమాలకు దూరంగా ఉంటాను అంటోంది. అయితే ఇంత జరిగి ఆమెకంటూ ఒక ఇమేజ్ వచ్చేసాక ఇప్పుడు రూట్ మారిస్తే ఏమైనా ప్రయోజనం కలుగుతుందా, ఏమో చూడాలి.
801740 854325whoah this blog is excellent i like reading your posts. 808532
156525 28024An interesting discussion is worth comment. I believe which you need to write far more on this subject, it may not be a taboo subject but typically individuals are not enough to speak on such topics. To the next. Cheers 238297