మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే చిత్ర ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ఈ చిత్రంలోని బాస్ పార్టీ సాంగ్ ను రేపు విడుదల చేస్తున్న విషయం తెల్సిందే.
ఇక హరిహర వీర మల్లు షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న విషయం తెల్సిందే. అలాగే వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వాల్తేర్ వీరయ్య సినిమా సెట్స్ ను సందర్శించాడు. అలాగే బాస్ పార్టీ సాంగ్ ను కూడా చూశాడట. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించాడు.
ఈ సందర్భంగా బాస్ పార్టీ సాంగ్ ను వీక్షించిన పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ వాల్తేర్ వీరయ్యకు సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ కథానాయిక అన్న విషయం తెల్సిందే.