కేవలం 16 కోట్లతో కన్నడలో రూపొందిన ఒక చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం నిజంగా అమోఘం. నిజానికి ఆ సినిమాలో ఎవరూ కర్ణాటక దాటితే బయట తెలీరు. అయినా కానీ కాంతారా అద్భుత విజయం సొంతం చేసుకుంది. కంటెంట్ ఉంటే చాలు, భారీ తారాగణం, హంగులు ఇవేమీ అవసరం లేవని నిరూపించింది కాంతారా.
తాజా సమాచారం ప్రకారం కాంతారా 400 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి శభాష్ అనిపించుకుంది. ఇది నిజంగా చరిత్ర. ఇంకా ఈ చిత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధిస్తుండడం విశేషం. కేవలం కర్ణాటక నుండే ఈ చిత్రం 165 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ 60 కోట్ల గ్రాస్ పైమాటే. నార్త్ ఇండియాలో దాదాపు 100 కోట్ల నెట్ వసూళ్లతో ఆశ్చర్యపరిచింది.
హోంబేలె ఫిల్మ్స్ రూపొందించిన కాంతారాలో రిషబ్ శెట్టి లీడ్ రోల్ పోషించడమే కాకుండా దర్శకత్వం వహించాడు. సప్తమి గౌడ, కిషోర్ కుమార్ లు కీలక పాత్రలు పోషించారు.