Switch to English

పవన్‌ కళ్యాణ్‌ – 2 కోట్లు.. 2 రాష్ట్రాలు.. 2 సూచనలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రెండు తెలుగు రాష్ట్రాలకూ చెరో యాభై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం విదితమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఈ మొత్తం అందనుంది. మరోపక్క, కేంద్ర ప్రభుత్వానికి కూడా 1 కోటి అందించనున్నట్లు తెలిపారు పవన్‌ కళ్యాణ్‌. ఇది పీఎం రిలీఫ్‌ ఫండ్‌కి వెళుతుంది. పవన్‌ కళ్యాణ్‌కి ఇలా విరాళాలు ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ, ప్రతిసారీ ఆయన విరాళం అందర్నీ ఇన్‌స్పైర్‌ చేస్తుంది.

చాలా గుప్తదానాల నడుమ, ఇలాంటివి కొన్ని మాత్రమే ప్రచారంలోకి వస్తుంటాయనుకోండి.. పవన్‌ కళ్యాణ్‌ తరఫున.. అది ఆయన ప్రత్యేకత. ఇదిలా వుంటే, ఓ రాజకీయ పార్టీ అధినేతగా, ప్రజల బాగోగుల గురించి స్పందించడంలో పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ తన బాధ్యతని విస్మరించలేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలని ఉద్దేశించి కీలక సూచనలు చేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. తెలంగాణ నుంచి విద్యార్థుల్ని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్‌లోని తమ ఊళ్ళకు పంపించేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ముందస్తుగా చర్చలు జరిపి వుండాల్సిందని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు.

సరిహద్దుల వద్ద జనాన్ని నిలిపివేయడంతో ఎక్కువమందికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిసుతన్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి సరిగ్గా ఎన్‌95 మాస్క్‌లు అందుబాటులో లేవంటూ వైద్యులు చెబుతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు జనసేన అధినేత. మరోపక్క, నిత్యావసర వస్తువుల కోసం జనం క్యూ కట్టే పరిస్థితి ఏర్పడకుండా, ప్రజలకు ఇంటి వద్దకే వాటిని అందించే ఏర్పాట్లు చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని జనసేన అధినేత కోరారు.

విరాళం ఇవ్వడమే కాదు, విలువైన సూచనలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ని ఈ సందర్భంగా అభినందించాల్సిందే. మరి, దీన్ని సూచనగా భావిస్తారా.? లేదంటే, షరామామూలుగానే రాజకీయ విమర్శలకు పరిమితమై, పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని అధికార వైసీపీ నేతలు తెరపైకి తెస్తారా.? అనేది వేచి చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...