Switch to English

నిజంగానే ‘కాపు’కాస్తున్నారా.? జగన్‌ సర్కార్‌ని నిలదీసిన పవన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ‘కులం’ చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నాయి.. ‘మతం’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయి. అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ)తోపాటు, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. పబ్లిసిటీ స్టంట్స్‌లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారన్నది నిర్వివాదాంశం. ఇక, ఎన్నికల వేళ ‘కాపు’ ఓటు బ్యాంకు కోసం టీడీపీ, వైసీపీ పడరాని పాట్లూ పడ్డాయి. ఈ క్రమంలో ‘కాపు కార్పొరేషన్‌’ చుట్టూ చాలా ఆసక్తికరమైన చర్చ, ఎన్నికల తాయిలాలు చూశాం.

కాపు కార్పొరేషన్‌కి చంద్రబాబు సర్కార్‌ ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు చెబితే, తాము అధికారంలోకి వచ్చాక 2000 కోట్లు ఇస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారు. మరి, అధికారంలోకి వచ్చాక.. మాట నిలబెట్టుకున్నారా.? అంటే, మాట ఇచ్చినదాని కంటే ఎక్కువ నిధులు కాపు కార్పొరేషన్‌కి ఇచ్చామని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, జగన్‌ సర్కార్‌ని సూటిగా ప్రశ్నించారు.

కాపు కార్పొరేషన్‌కి జగన్‌ సర్కార్‌ కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్‌ చేశారు. నిజానికి కాపు కార్పొరేషన్‌కి ప్రభుత్వం కేటాయించామంటోన్న నిధుల్లో, వివిధ పథకాల్ని జోడించారు. ఆ పథకాల్లో చాలావరకు కులమతాలకతీతంగా అందరికీ చేరుతున్నవే. ఇందులో ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వం కేటాయించింది ఏంటి.? అన్నది కీలకమైన విషయం. కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు ఈ విషయమై చర్చ జరుగుతోంది కూడా.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ జగనన్న చేదోడు, జగనన్న తోడు.. ఇలా పలు పథకాల్ని కలుపుకుంటే మొత్తంగా 2845 కోట్ల రూపాయల్ని ‘కాపు కార్పొరేషన్‌’ లెక్కల్లో ప్రభుత్వం చూపుతుండడాన్ని కాపు సామాజిక వర్గ పెద్దలు తప్పు పడ్తున్నారు. ఎన్నికల సమయంలో కాపు కార్పొరేషన్‌కి 2 వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పిన వైఎస్‌ జగన్‌, ఇప్పుడు మాట తప్పారంటున్నారు వారంతా. అధికార పార్టీ చేస్తోన్న ఈ పబ్లిసిటీ స్టంట్లు కులాల మధ్య చిచ్చు రేపేలా వుందని జనసేనాని వ్యాఖ్యానించారు.

కాపు సామాజిక వర్గం డిమాండ్‌ చేస్తోన్న రిజర్వేషన్ల అంశాన్ని తొక్కి పెట్టి, ఈ పబ్లిసిటీ స్టంట్స్‌తో కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారా.? అని జనసేనాని నిలదీశారు ప్రెస్‌నోట్‌ ద్వారా. ఇప్పుడు ఈ ప్రెస్‌నోట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

19 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...