Switch to English

‘ఊరు పేరు భైరవకోన’ అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్: నిర్మాత రాజేష్ దండా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజేష్ దండా ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

‘ఊరు పేరు భైరవకోన’ ఎలా మొదలైయింది ?

సందీప్ కిషన్, నేను, విఐ ఆనంద్ మంచి ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యుటర్ గా 12 ఏళ్ల పాటు చేశాను. నిర్మాతగా చేయాలనుకున్నపుడు హాస్య మూవీస్ బ్యానర్‌ లో మొదట అనుకున్న సినిమానే ‘ఊరు పేరు భైరవకోన’. నిర్మాతగా చేయాలనుకున్నప్పుడు కథ కొత్తగా వుంటేనే చేయాలని భావించాను. విఐ ఆనంద్ చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించింది. కొత్త కంటెంట్ తో కొత్త జోనర్ లో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది, క్రేజ్ వస్తుందని నమ్మి చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైయింది. సందీప్ కిషన్ గారి కెరీర్ లో హయ్యట్ బడ్జెట్ సినిమా ఇది. అలాగే హయ్యస్ట్ బిజినెస్ సినిమా కూడా ఇదే. విడుదలకు ముందు చాలా హ్యాపీగా వున్నాం. ఆనంద్ గారు చెప్పిన దానికి రెండింతల అద్భుతంగా సినిమాని తీశారు.

బ్యాట్ టు బ్యాక్ హిట్లు కొట్టారు..’ఊరు పేరు భైరవకోన’తో హ్యాట్రిక్ అందుకుంటారనే నమ్మకం ఉందా ?

నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాం. ‘ఊరు పేరు భైరవకోన’తో సక్సెస్ ట్రాక్ ని కొనసాగించి హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం వుంది. ప్రీమియర్ షోలన్నీ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ లో ప్రముఖ సింగిల్ స్క్రీన్స్ లో ప్రీమియర్స్ అన్నీ ఫుల్ కావడం ఈ సినిమాపై వున్న క్రేజ్ కి అద్దం పడుతున్నాయి.

ఈ కథలో మీకు నచ్చిన పాయింట్?

‘ఊరు పేరు భైరవకోన’ ఫాంటసీ థ్రిల్లర్. మన ఊర్లో ఏం జరుగుతుందో మనికి తెలుసు. కానీ ‘భైరవకోన’ అనే ఊరులో కొత్తగా వెరైటీగా ఎవరూ ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయి. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అలాగే గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి ఈ కథకి వున్న లింక్ ఏమిటనేది కూడా చాలా ఆసక్తిగా వుంటుంది. సినిమాలో47 నిమిషాల అద్భతమైన సిజీ వర్క్ వుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వుంటాయి. ప్రేక్షకులకు చాలా గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చే చిత్రమిది.

అనిల్ సుంకర గారు ఎలాంటి సూచనలు ఇస్తుంటారు ?

నేను అనిల్ గారు కలసి చేసిన సినిమాల కథలు ముందు నేను విని నచ్చితే అనిల్ గారు వింటారు. విని ఆయన సలహాలు సూచనలు చేస్తారు. ఇందులో కూడా ఆయన ఓ విలువైన సూచనా చేశారు. అది చాలా హెల్ప్ అయ్యింది.

‘ఊరు పేరు భైరవకోన’ కి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు చెప్పారు.?

డైరెక్టర్ గారు చెబితే ఖచ్చితంగా వుంటుంది. అయితే ఇందులో మాత్రం సీక్వెల్ లీడ్ లాంటి ఏమీ ఇవ్వడం లేదు. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ చేయొచ్చు. రెండు ఆలోచనలు వున్నాయి.

నిజమేనా చెబుతున్నా పాట చాలా పెద్ద హిట్ అయ్యింది కదా.. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర గురించి ?

శేఖర్ చంద్ర తన ప్రతి సినిమాలో చాలా మంచి పాటలు ఇస్తారు. ఇందులో నిజమేనా చెబుతున్న పాట చాలా వైరల్ అయ్యింది. నిజానికి ఈ ట్యూన్ శేఖర్ దగ్గర ఐదేళ్ళుగా వుంది. చాలా మందికి వినిపించాడు. ఫైనల్ సందీప్ కిషన్ విని దర్శకుడికి వినమన్నారు. అలా ఆ పాట మాకు రావడం చాలా లక్కీ. ఇందులో నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.

‘ఊరు పేరు భైరవకోన’లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న మూమెంట్స్ ?

‘భైరవకోన’ ఊరు గురించి చెప్పడం ఆసక్తికరంగా వుంటుంది. తర్వాత ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా వుంటాయి. ‘భైరవకోన’లోకి ఎంటరైన తర్వాత జర్నీ అంతా థ్రిల్లింగా వుంటుంది.

ఈ సినిమా కోసం సందీప్ కిషన్ చాలా హార్డ్ వర్క్ చేశారు కదా ? తనకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నారు ?

సందీప్ కిషన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తనే ఈ సినిమాకి హెల్ప్ అయ్యాడనే విధంగా చేశాడు. తన కెరీర్ కి, మా బ్యానర్ కి ఇది నెంబర్ 1 సినిమా అవుతుందనే నమ్మకం వుంది.

కొత్తగా చేస్తున్న చిత్రాలు?

అల్లరి నరేష్ గారితో బచ్చల మల్లి షూటింగ్ జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా చేయబోతున్నాం.

39 COMMENTS

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

మంగళగిరిలో లోకేశ్ 76వ రోజు ప్రజాదర్బార్‌లో వినతుల వర్షం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన 76వ రోజు ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్రతి ఒక్కరినీ...

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్—జోగి రమేష్, జోగి రాము—మళ్లీ వార్తల్లో నిలిచారు. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో...

ఎట్టకేలకు.. రెండవ వివాహం చేసుకున్న సమంత!

దీర్ఘకాలంగా ఊహాగానాల మధ్య ఉన్న నటీమణి సమంత రూత్ ప్రభు  చివరకు తన రెండవ వివాహం పూర్తి చేసుకున్నారు. దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఇషా యోగ...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల షాక్!

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నట్లు  వారు తెలిపారు....

“మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి”: బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2025న...