Switch to English

హైదరాబాద్ లో పరువు హత్య.. అల్లుడిని చంపించిన మామ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పరువుకు మరో యువకుడు బలైపోయాడు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓ మామ తన అల్లుడినే మట్టుబెట్టించాడు. మిర్యాలగూడకు చెందిన మారుతిరావు తన కుమార్తె అమృత వివాహం చేసుకున్న ప్రణయ్ ను చంపించిన ఘటన తరహాలోనే ఇది కూడా జరిగింది.

హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన లక్ష్మారెడ్డి.. తన కుమార్తె అవంతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అల్లుడు హేమంత్ ను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. చందానగర్ కు చెందిన హేమంత్.. తన ఇంటి సమీపంలో ఉండే అవంతిక ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురిదీ వేర్వేరు కులాలు కావడంతో అవంతిక తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఆమెను ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో అవంతిక ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఈ ఏడాది జూన్ 10న గుడిలో వివాహం చేసుకున్నారు.

అనంతరం గచ్చిబౌలి టీఎన్ జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో లక్ష్మారెడ్డి అల్లుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అవంతిక మేనమామ యుగేంధర్ రెడ్డి మరికొంతమందితో కలిసి అవంతిక వద్దకు వచ్చాడు. ఇరువురినీ బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అదే సమయంలో అవంతికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించారు. దీంతో వారి వెంట వెళ్లేందుకు ఇరువురూ అంగీకరించి కారెక్కారు. అయితే, ఇంటి వైపు కాకుండా మరో రూట్ లో తీసుకెళ్లడంతో అనుమానం వచ్చి ఇద్దరూ కారు నుంచి బయటకు దూకేశారు. దీంతో ఆమె మేనమామ తదితరులు హేమంత్ ను వెంబడించి పట్టుకున్నారు. అవంతికను అక్కడే వదిలేసి హేమంత్ ను ఒక్కడినే కొట్టుకుంటూ కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.

దీంతో తీవ్ర ఆందోళనకు లోనైన అవంతిక.. వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలించగా సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెం శివార్లలో హేమంత్ మృతదేహం లభ్యమైంది. తన మేనమామే తన భర్తను హత్య చేశాడని, ఈ హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దని అవంతిక స్పష్టంచేశారు. కుమార్తె ప్రేమను కాదని, అల్లుడిని చంపించిన మారుతీరావు చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూసి కూడా లక్ష్మారెడ్డి అలాంటి ఘాతుకానికే తెగబడటం గమనార్హం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...