Switch to English

టీడీపీని జూ. ఎన్టీఆర్‌ స్వాధీనం చేసుకోవాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజమే అయినా, గతంలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితుల్ని ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో పూర్తిగా గల్లంతయిపోయింది. ఆ పార్టీకి తెలంగాణలో చెప్పుకోదగ్గ నాయకుడు లేడిప్పుడు.

మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు ముందు అగమ్య గోచరమే. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి తెలంగాణలో వచ్చిన సీట్లు.. ఆ తర్వాత అక్కడ మారిన రాజకీయ పరిణామాలు చూస్తే, అచ్చంగా.. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోనూ రిపీట్‌ అయ్యేలా వుంది. ఎప్పుడైతే నారా లోకేష్‌ని రాజకీయంగా ప్రొజెక్ట్‌ చేయాలనుకున్నారో చంద్రబాబు, అప్పటినుంచే టీడీపీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఇప్పుడది అత్యంత అవసాన దశకు దిగజారిపోయింది. మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశాలు లేవు.

Also Read: ఆ విషయంలో బాబును కొట్టేవారే లేరు!

ఈ పరిస్థితుల్లో స్వర్గీయ ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ బాగుపడటమంటే అది జూనియర్‌ ఎన్టీఆర్‌ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు. టీడీపీలో కొందరు నేతలు సైతం ఇదే మాట చెబుతున్నారు. ‘వున్నపళంగా నారా లోకేష్‌ని రాజకీయాల నుంచి తప్పించండి.. ఆయన్ని మీ వ్యాపార అవసరాల కోసం మాత్రమే పరిమితం చేయండి.. పార్టీలో సలహాదారుగా మీరు వుండొచ్చు.. పార్టీ బాధ్యతలు మాత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఇచ్చేయడం మంచిది..’ అని కొందరు టీడీపీ నేతల బృందం ఒకటి ఇటీవల చంద్రబాబుని కలిసి క్లాస్‌ తీసుకుందట. అది సాధ్యమేనా.?

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు విడిచిపెట్టే పరిస్థితి వుంటుందా.? జూనియర్‌ ఎన్టీఆర్‌ని గతంలో వాడుకుని వదిలేసిన చంద్రబాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ని టీడీపీ కోసం బతిమాలే అవకాశం వుందా.? లోకేష్‌ భవిష్యత్తు కోసం పార్టీని పణంగా పెట్టిన చంద్రబాబు, ఆ పార్టీని ఎన్టీఆర్‌కి అప్పగించేస్తారని ఎలా అనుకోగలం.? టీడీపీ సంగతి తర్వాత, అసలంటూ రాజకీయాల పట్ల యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ఆసక్తి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా కెరీర్‌ తప్ప ఇంకే ఇతర ఆలోచనలూ చేయడంలేదు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. అదే అతనికి మంచిది కూడా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...