Switch to English

ఆ విషయంలో బాబును కొట్టేవారే లేరు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఉద్రిక్తతలు, నిరసనలు, ఆందోళనల నడుమ ఏపీలో అధికార, విపక్షాలు చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. వైఎస్సార్ సీపీ బాధితులంటూ తెలుగుదేశం పార్టీ.. టీడీపీ బాధితులంటూ వైఎస్సార్ సీపీ పోటాపోటీగా బాధిత శిబిరాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ చలో ఆత్మకూరుకు పిలుపునివ్వగా.. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి భగ్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు.

ఈ పరిణామాలన్నీ ముందుగానే ఊహించిన చంద్రబాబు.. ప్రతి అంశాన్నీ మీడియాలో హైలైట్ అయ్యేలా చూసుకున్నారు. ఆయనకు అనుకూలంగా ఉన్న తెలుగు మీడియా అంతా ఈ విషయానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చి కవర్ చేయగా.. జాతీయ మీడియాలో సైతం ఇదంతా కవర్ అయ్యేలా బాబు టీం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో రోజంతా ఈ అంశంపై జాతీయ మీడియా కథనాలు, బ్రేకింగ్ న్యూస్ లతో కుమ్మేసింది. వాస్తవానికి ప్రాంతీయ అంశాలను.. అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని నేషనల్ మీడియా.. పబ్లిసిటీ స్టంట్ కోసం నడుస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఇంతగా కవరేజ్ చేయడానికి కారణమేమిటా అని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

Also Read: వైసీపీ వర్సెస్‌ టీడీపీ: ‘పల్నాడు’ ఫైట్‌లో గెలిచిందెవరు.?

ఈ విషయంలో రెండు రోజుల ముందు నుంచి టీడీపీ పబ్లిసిటీ వింగ్ అత్యంత పకడ్బందీగా వ్యవహరించినట్టు తెలిసింది. హైదరాబాద్, ఢిల్లీల్లో ఉంటే నేషనల్ మీడియా సిబ్బందికి క్షణం క్షణం అప్ డేట్స్ ఇవ్వడంతోపాటు వివిధ టీవీ ఛానళ్ల ప్రతినిధులు ఉండవల్లి, ఆత్మకూరు రావడానికి విమాన టికెట్లు సమకూర్చడంతోపాటు ఇతరత్రా రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇవే కాకుండా పెద్ద మొత్తంలో పైసలు కూడా చేతులు మారినట్టు సమాచారం. దీంతో జాతీయ మీడియాలో ఒక రేంజ్ లో బాబు మళ్లీ హైలైట్ అయ్యారు. చలో ఆత్మకూరు భగ్నమైనా తాను అనుకున్నది సాధించారు.

మరోవైపు ఈ విషయంలో అధికార వైఎస్సార్ సీపీ తేలిపోయింది. ఒక్క సాక్షి ఛానల్ మినహా మిగిలిన ఏ ఛానల్ లోనూ అనుకున్నంత ప్రచారం జరగలేదు. పైగా జాతీయ మీడియాలో ఏకంగా నెగిటివ్ కథనాలు ప్రసారం కావడం ఆ పార్టీ కేడర్ కి మింగుడుపడటంలేదు. విపక్షంలో ఉన్నప్పుడు ఎలాగూ మీడియా మద్దతు లేదని, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏమిటని వారు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ పబ్లిసిటీ వింగ్ పనిచేసినంత సమర్థంగా వైఎస్సార్ సీపీ మీడియా వింగ్ పనిచేయకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అధికారంలో ఉన్నా, లేకపోయినా మీడియాను మేనేజ్ చేయడంలో తనకు తానే సాటి అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఈ విషయంలో ఆయన్ను కొట్టేవారే లేరనడం అతిశయోక్తి కాదేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...