Switch to English

టీఆర్ఎస్ లో చిచ్చు చల్లారినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణ అధికార పార్టీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు, అసంతృప్తులు ఎక్కువయ్యాయి. నయానో, భయానో అసమ్మతిని ప్రస్తుతానికి అణచివేస్తున్నా.. ఇదేమీ అంత అర్రీ బుర్రీ యవ్వారం కాదనే సంగతి అర్థమవుతోంది. బెదిరింపులకో, బుజ్జగింపులకో ప్రస్తుతానికి దారిలోకి వచ్చినట్టు కనిపిస్తున్న నేతలు.. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటారా అన్నది చెప్పలేం.

ఇక అలాంటి నేతల పట్ల అధినాయకత్వానికి అనుమానపు చూపులు కొనసాగకుండా ఉంటాయా అనేది కూడా డౌటే. అంటే వారు పార్టీలో కొనసాగినా.. గతంలో ఉన్నంత సాఫీగా పరిస్థితులు ఉండవనేది విస్పష్టం. అసలు విపక్షాలే లేకుండా చేయాలనే ఉద్దేశంతో సారు కారుని నడిపిస్తుంటే.. సొంత పార్టీలోనే అసమ్మతి రేగడం అగ్ర నాయకత్వానికి మింగుడు పడటంలేదు. వాస్తవానికి టీఆర్ఎస్ నేతల్లో చాలాకాలంగా అసమ్మతి, అసంతృప్తి గూడు కట్టుకుని ఉన్నాయని.. కానీ బటయపెట్టే ధైర్యం ఎవరూ చేయలేకపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read: అంతలోనే మాట మార్చిన నాయిని

పిల్లి మెడలో గంట ఎవరు కడతారా అని ఎదురు చూశారని.. మంత్రివర్గ విస్తరణ వ్యవహారంలో తన పేరు పదే పదే వినిపించడంతో మంత్రి ఈటల రాజేందర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో వారంతా బయటకు వస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో తాము కిరాయిదారులం కాదని, గులాబీ జెండాకు తామే అసలు సిసలు ఓనర్లమంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. వెంటనే అధిష్టానం దిద్దుబాట పట్టి, ఈటలను సముదాయించి ఆయన చేత ఖండన ప్రకటన జారీ చేయించింది.

అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఒకరు తర్వాత మరొకరు ఓనర్ల వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో అసలు పరిస్థితి ఏమిటో బయటకు వచ్చేసింది. వాస్తవానికి మళ్లీ ఎన్నికలు రావడానికి ఐదేళ్లు ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిపినా అందుకు మూడేళ్ల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై తిరుగుబావుటా ఎగురవేయడం ద్వారా సదరు నేతలు సాధించేది ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.

అయితే, తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో ఉన్న నేతలు.. ఇలాంటి ఝలక్ ల ద్వారా అధిష్టానం దృష్టిలో పడటమే కాకుండా తమ డిమాండ్లు నెరవేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈటల విషయంలో ఇది రుజువైంది. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించడం ఖాయమని, అధినేత కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని, అధినాయకత్వమే ఈ విషయంలో ఈటలకు వ్యతిరేకంగా రెండు పత్రికల్లో కథనాలు కూడా రాయించిందని ప్రచారం జరిగింది.

దీంతో ఈటల తెలివిగా వ్యవహరించి ధిక్కార స్వరం వినిపించడంతో అధినాయకత్వం ఆయన్ను పిలిపించి మాట్లాడమే కాకుండా మంత్రి పదవి నుంచి తొలగించకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఈటల తన విషయంలో విజయం సాధించడంతో పలువురు అదే బాట పట్టారని అంటున్నారు. అందువల్లే అధిష్టానికి వ్యతిరేకంగా గళం విప్పి తమ డిమాండ్లు సాధించుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...