Switch to English

ఇంతకీ గంటా ఎటువైపు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,461FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా? ఒకవేళ పార్టీలోనే ఉంటే చంద్రబాబుకు స్వాగతం పలకడానికి విశాఖ విమానాశ్రయానికి ఎందుకు రాలేదు? అక్కడ అంత గొడవ జరిగినా ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? ఇవీ ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్నలు. అసలు గంటా వైఖరి ఏమిటి అనేదానిపై పూర్తిగా సందిగ్ధం నెలకొంది.

వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో గంటా తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. బీజేపీలోకి వెళ్లాలా లేక వైసీపీ వైపు మొగ్గాలా అనే విషయంలో తర్జనభర్జనలు పడ్డారు. ఓ దశలో వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆయన మాట్లాడటంతో ఇక అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అంతలోనే.. విశాఖవాసిగా ఆ ప్రాంతానికి రాజధానిని స్వాగతిస్తానని, అదే సమయంలో పార్టీ వైఖరికి కట్టుబడి ఉన్నానంటూ ప్రకటన చేశారు.

దీంతో విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విషయంలో తన వైఖరి ఏమిటనేది స్పష్టంగా చెప్పలేదు. తర్వాత కొంతకాలం సైలెంటుగా ఉన్న గంటా.. మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలమయ్యారు. పలువురు కార్యకర్తలను తన సమక్షంలో టీడీపీలో చేర్చుకున్నారు. అధినేత చంద్రబాబు తలపెట్టిన యాత్రను తన నియోజకవర్గంలో ప్రారంభించారు. దీంతో అధికార పార్టీలోకి ఆయన వెళ్లడం మానుకున్నారేమోనని అభిప్రాయాలు వచ్చాయి. అయితే, తాజాగా చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు గంటా ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.

సాధారణంగా చంద్రబాబు విశాఖ వస్తే అన్ని విషయాలూ గంటాయే చూసుకునేవారు. విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలకడంతోపాటు పర్యటన మొత్తం బాబు వెంటే ఉండేవారు. అలాంటిది గురువారం విశాఖ వచ్చిన చంద్రబాబును పలకరించడానికి కూడా గంటా రాలేదు. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారా లేక పార్టీ మారే ఆలోచనల్లో ఏమైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.

అక్కడ నిరసన జరుగుతుందని ముందే అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తాను వారికి టార్గెట్ గా మారడం రాజకీయంగా ఇబ్బంది అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తేనే స్పష్టత వస్తుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...