Switch to English

పవన్ కళ్యాణ్.! మీ సాయం మాకొద్దు.! దేనికి సంకేతమిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘మాకు ఎవరి సాయమూ అవసరం లేదు.. ప్రభుత్వం మా ఇళ్ళను కూల్చలేదు..’ అంటూ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీలు వెలిశాయ్.. కొన్ని ఇళ్ళ ముందర.!

రోడ్ల వెడల్పు పేరుతో ప్రభుత్వం, ఇప్పటం గ్రామంలోని కొన్ని ఇళ్ళను కూల్చివేసిన మాట వాస్తవం. కనిపిస్తున్న శిధిలాలే అందుకు సాక్ష్యం. బస్సు కూడా రాని ఓ చిన్న గ్రామంలో, 120 అడుగుల మేర రోడ్డు విస్తరణ.. అంటే చిన్న విషయం కాదు. సరే, రోడ్ల విస్తరణ విషయంలో ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, పద్దతి ప్రకారం విస్తరణ కోసం కూల్చివేతలు జరిగాయా.? లేదా.? అన్నదే చర్చ ఇక్కడ.

పైగా కూల్చివేతల క్రమంలో మహనీయుల విగ్రహాలు, దేవతా విగ్రహాలు కూడా కూల్చేసి.. వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం అలాగే వుంచేశారు. తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో.. పరువు పోతుందని భావించి, ఆ వైఎస్సార్ విగ్రహాల్నీ ఆ తర్వాత తొలగించారనుకోండి.. అది వేరే సంగతి.

కూల్చివేత తాలూకు శిధిలాలు అంత చక్కగా అక్కడ కనిపిస్తోంటే, ఆ శిధిలాల సాక్షిగానే, ‘ప్రభుత్వం కూల్చలేదు.. మాకు ఎవరి సానుభూతి, సాయం అవసరం లేదు..’ అని కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

‘ఔను, వైఎస్ వివకానందరెడ్డిని ఎవరూ చంపలేదు. ఆయనకు గుండె పోటు వచ్చి, తన తలని బాత్రూమ్ కమోడ్‌తో బద్దలుగొట్టుకుని.. అప్పటికీ ప్రాణం పోకపోవడంతో, గొడ్డలి తెచ్చేసి నరికేసుకున్నారు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ నడుస్తున్నాయి.. ఇప్పటం వ్యవహారంతో.!

‘మాకు సాయం వద్దు మొర్రో..’ అని ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టాక, ఇక అక్కడ జనసేన అధినేత చేసేదేముంటుంది.? ప్రజలకు అండగా నిలబడటానికి ఆస్కారమేముంటుంది.? ప్రకటించిన లక్ష రూపాయల సాయం కూడా దండగే.. ఇవ్వకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ, నిజమైన బాధితులున్నారక్కడ. వారికి సాయం అందిస్తానని జనసేనాని ప్రకటించారు. అందిస్తారు కూడా.! 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 15 కూడా లేవు.. 53 ఇళ్ళలో జనసేన సానుభూతిపరులున్నారని చెప్పడమేంటంటూ వైసీపీ అను‘కుల’ మీడియా పిచ్చి రాతలు మొదలు పెట్టింది.

పార్టీలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వైసీపీకి మాత్రమే చెల్లిన విషయం. అధికారం చేతిలో లేకపోయినా, తన సంపాదన నుంచి కులం, మతం, పార్టీలు చూడకుండా సాయం చేయడం జనసేనానికి మాత్రమే చేతనైన గొప్ప పని.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...