Switch to English

నో డౌట్, ‘మా’ యుద్ధంలో చిరంజీవిదే గెలుపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

గెలిచి ఓడిపోవడం.. ఓడి గెలవడం.. ఈ రెండిటికీ భిన్నమైన అర్థాలుంటాయి. నానా తంటాలూ పడి గెలిచినా, చివరికి అది ఓటమి కిందకే వస్తుంది. ఓడిపోయినా, ఒక్కోసారి.. ‘దీన్ని గెలవడం అంటారు..’ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది.

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణ గెలిచాడు, ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. కానీ, యుద్ధం జరిగింది మోహన్ బాబుకీ, చిరంజీవికీ మధ్య.. అనే ప్రచారం జరిగింది. అలా ‘యుద్ధాన్ని’ కొత్త కోణంలోకి మార్చేందుకు ‘మంచు’ వర్గం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, నాగబాబు తప్ప, మెగా కాంపౌండ్ నుంచి ఎవరూ ‘మా’ ఎన్నికల కోసం ప్రత్యక్షంగా హంగామా చేసింది లేదు.

విష్ణు గెలిచాక, ‘మోహన్ బాబు గెలిచారు.. చిరంజీవి ఓడిపోయారు..’ అనే ప్రచారాన్ని సినీ పరిశ్రమలో ‘మంచు’ వర్గం గట్టిగా చేయగలిగింది. మీడియాని కూడా అలాగే మేనేజ్ చేశారు. కానీ, గెలిచిన మంచు విష్ణు.. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం.. అన్నట్టు, పలువురు ప్రముఖుల వద్దకు వెళ్ళి కలిశాడు. మోహన్ బాబు కూడా తన కుమారుడ్ని వెంటబెట్టుకుని నందమూరి బాలకృష్ణ దగ్గరకు వెళ్ళిన విషయం విదితమే.

ఇక, ‘మా’ వ్యవస్థాపక అధ్యక్షుడైన చిరంజీవి వద్దకు మాత్రం మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వెళ్ళినట్టు లేదు. వెళ్ళకపోవడం వల్ల చిరంజీవికి వచ్చిన నష్టమూ లేదు. కాగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులెవరూ, ‘మా’ కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాకపోవడం మరో ఆసక్తికరమైన అంశం.

ఇంకోపక్క, మంచు కుటుంబం నుంచి మంచు మనోజ్, ఇటీవల జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళారు. దాంతో, ‘మంచు’ వర్గం, మెగా కాంపౌండ్‌ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారానికి బలం చేకూరింది. నిజానికి, మంచు మనోజ్ రూటే సెపరేటు. అతనెప్పుడూ, మెగా కాంపౌండ్‌కి కాస్త దగ్గరగానే వుంటూ వస్తున్నాడు.

నిజానికి, మంచు విష్ణు కావొచ్చు.. మోహన్ బాబు కావొచ్చు.. తమకు అవసరమైనప్పుడు చిరంజీవిని ఆకాశానికెత్తేయడం పలు సందర్భాల్లో జరిగింది. సో, ఎలా చూసుకున్నా.. ఈ ‘మా’ వ్యవహారంలో, చిరంజీవికి కలిగిన నష్టమేమీ లేదు. ఏదో నష్టం జరిగిపోయిందంటూ ‘మంచు’ వర్గం దుష్ప్రచారం చేయడం మినహా. నిజానికి, ఈ ‘అతి’ జరగడానికి మరో కీలకమైన కారణం శకుని నరేష్. ఆ శకుని ‘మా’ విషయంలో మంచు విష్ణుని ముంచేసే రోజెంతో దూరంలో లేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....