Switch to English

ఔనా! నిజమా.? ఆంధ్రప్రదేశ్‌లో నిధుల కొరత లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అప్పు చేస్తే తప్ప పూటగడవని దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది కళ్ళ ముందు కనిపిస్తోన్న వాస్తవం. ప్రతి నెలా కొత్త అప్పు చేయాల్సిందే.. నెలవారీ అప్పులే కాదు, మధ్యంతరంగా.. అంటే, నెల మధ్యలో ఎప్పటికప్పుడు అప్పుల కోసం పరుగులు పెట్టకపోతే, రాష్ట్రం అనే బండి ముందుకు కదలడంలేదు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కనాకష్టంగా మారిపోయింది. కరోనా అనేది ఓ కుంటి సాకు మాత్రమే. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ, రాష్ట్ర ప్రజల నెత్తిన కనీ వినీ ఎరుగని స్థాయిలో అప్పుల భారం మోపేస్తోంది వైఎస్ జగన్ సర్కార్. పబ్లిసిటీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.. అప్పుల భారం మోసేదేమో రాష్ట్ర ప్రజలు.

సంక్షేమ పథకాలన్నటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు లేదంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు.. ఇదేదో ‘వైఎస్’ కుటుంబం కోసం రాష్ట్ర ప్రజలు తమ కష్టాన్ని వెచ్చించాల్సి వస్తున్నట్టుంది. లేకపోతే, ఆ ప్రకటనలేంటి.? ఆ పేర్లేంటి.? ఆ పథకాల కోసం చేస్తున్న అప్పులేంటి.? అని ప్రజాస్వామ్యవాదులు గుస్సా అవుతున్నారు.

ఇక, అసలు విషయానికొస్తే, రాష్ట్రంలో కరెంటు సంక్షోభం కనిపిస్తోంది. అబ్బే, ఇది దేశవ్యాప్త సంక్షోభం.. అంటూ జగన్ సర్కార్ కహానీలు వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాల సంగతి మనకెందుకు.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితేంటి.? అంటే, ‘నిధుల కొరత లేదు.. ఎంత ఖర్చయినా విద్యుత్తుని కొనేస్తాం..’ అంటూ వైఎస్ జగన్ సర్కార్ చెబుతోంది.

నిధుల కొరత లేకపోవడమేంటి.? జీతాలు ఇవ్వలేని దుస్థితికి నిధుల కొరత కారణం కాదా.? అప్పులు ఎడా పెడా దొరికేస్తోంటే, అడ్డగోలుగా ఖర్చు చేస్తూ.. నిధుల కొరత లేదని అనడం హాస్యాస్పదం కాక మరమేటి.? అన్నట్టు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడంలేదు, దాంతో కాంట్రాక్టర్లు రోడ్డున పడుతున్నారు బిచ్చగాళ్ళలా. హైకోర్టు నుంచి మొట్టికాయలు పడుతున్నాయి ప్రభుత్వానికి చెల్లింపుల విషయంలో. అక్కడేమో నిధుల కొరతని సాకుగా చూపుతోంది జగన్ సర్కార్. ఇప్పుడేమో నిధుల కొరత లేదంటోంది.. దేన్ని నమ్మాలి.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...