Switch to English

నేలకు దిగొస్తున్న నేపాల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చైనా అండ చూసుకుని ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉన్న భారత్ పైనే కయ్యానికి కాలు దువ్విన నేపాల్ కు నెమ్మదిగా తత్వం బోధపడుతోంది. డ్రాగన్ తమ వెన్నంటే ఉందనే మిడిసిపాటుతో మనపై అవాకులు చెవాకులు పేలి.. గాలిలో తేలియాడిన మన పొరుగుదేశం నేలకు దిగుతోంది. భారత్ లో అంతర్భాగమైన కాలాపానీ తమదే అంటూ హడావుడి చేసిన నేపాల్.. గతనెలలో ఉత్తరాఖండ్ లోని దార్చులా జిల్లా పిథోర్ గఢ్ సమీపంలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. నేపాలీ శహస్త్ర ప్రహారీ (ఎన్ఎస్ పీ) వీటిని నిర్వహిస్తోంది. అయితే, వీటిలో రెండు పోస్టులను నేపాల్ తొలగించింది.

నిజానికి సరిహద్దుల్లో తమ భద్రతకు ముప్పు ఏర్పడినా.. పొరుగుదేశం నుంచి ఏవైనా కవ్వింపు చర్యలు ఉన్నా చెక్ పోస్టులు పెడుతుంటారు. కానీ భారత్ నుంచి నేపాల్ కు అలాంటి పరిస్థితి లేదు. నేపాల్ తో మనకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ నేపాల్ ప్రధాని కేపీ ఓలి భారత్ వ్యతిరేక గళం విప్పడం.. చైనా అండ చూసుకుని చెలరేగిపోవడం వంటి పరిణామాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. భారత్ లోని కొన్ని భూభాగాలు తమవేనని పేర్కొంటూ మ్యాప్ ఆమోదించడం.. కాలాపానీ కూడా తమదేనని, దానిని తమకు ఇచ్చేయాల్సిందేనని పిచ్చి వ్యాఖ్యలు చేయడం.. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టులు పెట్టడం వంటి చర్యలతో మనకు వ్యతిరేకంగా మారింది.

అయితే, ఈ పరిణామాలు నేపాల్ ప్రజలకే కాదు.. ఓలి పార్టీలోని నేతలకు కూడా నచ్చలేదు. ముఖ్యంగా భారత్, నేపాల్ ప్రభుత్వాల మధ్య కంటే ప్రజల మధ్య చక్కని సంబంధాలున్నాయి. నేపాల్ కు చెందిన గూర్ఖాలు భారత సైన్యంలో దాదాపు 30వేల మంది ఉన్నారు. అలాగే మన సైన్యంలో పనిచేసి రిటైరైన తర్వాత నేపాల్ వెళ్లి స్థిరపడిన జవాన్ల కుటుంబాలకు భారత ప్రభుత్వమే ఇప్పటికీ పెన్షన్ చెల్లిస్తోంది. అలాంటి నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్న ఓలికి సొంత పార్టీ నేతలత నుంచే గట్టి సెగ తగిలింది.

పైగా ఏ చైనా కోసం భారత్ తో కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నించిన నేపాల్ ను సైతం డ్రాగన్ వదిలిపెట్టలేదు. ఆ దేశానికి చెందిన కొంత భూభాగాన్ని ఇటీవలే చైనా ఆక్రమించుకుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. ముఖ్యంగా భారత వ్యతిరేక చర్యలకు తెర తీసిన ఓలికి వ్యతిరేకంగా నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కీలక నేత ప్రచండ సహా పలువురు గళం విప్పారు. ఆయన్ను రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి బుధవారం కీలక సమావేశం జరగనుంది.

ఇదే సమయంలో భారత్, చైనా సరిహద్దుల్లో ఘర్షణపూరిత వాతావరణ చల్లబడటం.. చైనా బలగాలు వెనక్కి తగ్గడంతో నేపాల్ కూడా కిందకు దిగి వచ్చింది. భారత సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన రెండు చెక్ పోస్టులను తొలగించింది. మరో మూడింటిని కూడా త్వరలోనే తొలగించే అవకాశం ఉంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...