Switch to English

లోకేష్ హంగామా మొదలైంది.. జగన్ సందడి ఎప్పుడో మరి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘1978లో వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు..’ అంటూ నారా లోకేష్ తప్పులో కాలేశారు విశాఖలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా. 1978 లో ప్రధాని వాజ్‌పేయి కాదని పక్కనున్న టీడీపీ నేతలు చెప్పడంతో, లోకేష్.. తన వ్యాఖ్యల్ని సవరించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సవరణలు ఆయన ప్రసంగాల్లో చాలానే చూశాం.

‘టీడీపీకి వేరే శతృవు అవసరం లేదు.. నారా లోకేష్ ప్రసంగాలే టీడీపీని ముంచేస్తాయి..’ అన్న విషయం 2019 ఎన్నికల్లోనే నిరూపితమయ్యింది. రాజకీయ నాయకుల ప్రసంగాలకు జనం చప్పట్లు కొట్టడం అనేది గతంలోనూ వుంది.. ఇప్పుడూ వుంది. తేడా ఏంటంటే, రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి గతంలో జనం వచ్చేవారు. ఇప్పుడు తాము ఏం మాట్లాడినా లెక్క చేయకుండా చప్పట్లు కొట్టేవారిని రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నాయి.. అంతే తేడా.

లోకేష్ వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అదే సమయంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు కూడా తెరపైకొస్తోంది. జగన్ పేరు చుట్టూ కూడా ట్రోలింగ్ మొదలైంది. వైఎస్ జగన్ పలు సందర్భాల్లో దొర్లించిన తప్పుల్ని తెలుగుదేశం పార్టీకి చెందిన నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అలా అసలు విషయం పక్కకుపోయి, అడ్డగోలు చర్చకు సోషల్ మీడియా వేదికవుతోంది.

ఇక, తాను మంత్రిగా వున్నప్పుడు విశాఖను ఉద్ధరించేశానని నారా లోకేష్, విశాఖ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సెలవిచ్చారు. కరోనా సమయంలో కూడా ఆయా సంస్థలు (తమ హయాంలో ఏర్పాటైనవి) అద్భుతమైన సేవలందించాయన్నారు. విశాఖ మేయర్ పదవి టీడీపీకే దక్కతుందనీ నారా లోకేష్ బల్లగుద్ది మరీ చెప్పేశారు. ‘బస్తీ మే సవాల్..’ అంటూ అధికార పార్టీపై ఎడాపెడా విమర్శలు చేసేశారు నారా లోకేష్. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ వివాదం, విశాఖ రైల్వే జోన్ సహా పలు అంశాలు గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ‘అస్త్రాలుగా’ మారినప్పటికీ, అవెంతవరకు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి.? ప్రజల్ని ఆలోచింపజేస్తాయి.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.

కాగా, విపక్షాలకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా తయారైనా, అధికార పార్టీ మాత్రం తన అంగ, అర్థ బలంతో అడ్డగోలు ఏకగ్రీవాలతో పండగ చేసుకుంటోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశమే కన్పించడంలేదు. వస్తే మాత్రం, లోకేష్ తరహాలో కొన్ని ఆణిముత్యాలైనా జనానికి దొరుకుతాయ్.

3 COMMENTS

  1. 939878 527889Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You really know how to bring a difficulty to light and function out it crucial. The diet want to see this and appreciate this side on the story. I cant believe youre no much more popular since you surely possess the gift. 95989

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...