న్యాచురల్ స్టార్ నాని నుండి భారీ హిట్ వచ్చి చాలా కాలమైంది. ఈ మధ్య వచ్చిన సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నా కలెక్షన్స్ విషయంలో వెనకపడ్డాయి. శ్యామ్ సింగ రాయ్ జస్ట్ లో తప్పించుకుంది. అంటే సుందరానికీ చిత్రానికి డీసెంట్ రివ్యూలు వచ్చినా కానీ కలెక్షన్స్ లో గా ఉండడం మూలాన ప్లాప్ నుండి బయటపడలేదు. దీంతో ఇప్పుడు చేస్తోన్న దసరాపై పూర్తి ప్రెషర్ పడుతోంది.
షూటింగ్స్ కు నాని బ్రేక్ ఇవ్వడంతో దసరా షూటింగ్ వెనక్కి జరిగింది. ఈ సినిమా బడ్జెట్ చేయిదాటిపోతోంది అన్న మాటలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బడ్జెట్ ను తగ్గించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే నాని ఈ చిత్రం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడట. దసరా చిత్రానికి తాను తీసుకుంటున్న పారితోషికం తగ్గించుకుని దాని బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటాడట. దీని వల్ల నిర్మాతకు సౌలభ్యంగా ఉంటుందని భావిస్తున్నాడు.