అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం టెన్త్ క్లాస్ డైరీస్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకుడు గరుడవేగ ఫేమ్ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడితో ప్రత్యేక ఇంటర్వ్యూ.
టెన్త్ క్లాస్ డైరీస్ సినిమా గురించి చెప్పండి?
ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. యాక్షన్, వయోలెన్స్ ఎక్కువ ఉండవు. ఒక ఎమోషన్ ప్రధానంగా క్యారీ అవుతుంది. అది ఏంటి అనేది తెర మీదే చూడాలి. మా నిర్మాత అచ్యుత రామారావు గారు, ఆయన స్నేహితుల జీవితంలో నిజంగా జరిగిన కథ ఇది. దానికి కొంచెం సినిమాటిక్ టచ్ ఇచ్చాము అంతే.
మీరు సినిమాటోగ్రాఫర్ అయ్యుండి దర్శకుడు కావాలని ఎప్పుడు అనిపించింది?
నాకు డైరెక్షన్ పై ప్రత్యేకంగా మొదటి నుండి ఆసక్తి లేదు. ఈ బ్యానర్ లోనే నేను రెండు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేశాను. ఈ సందర్భంగా నిర్మాతతో మంచి అనుబంధం ఏర్పడింది. అప్పుడప్పుడూ ఆయన చెప్పిన సంఘటనల నుండి పుట్టిన కథ నన్ను ఇన్స్పైర్ చేసింది. అదే నన్ను దర్శకుడ్ని చేసింది.
సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయితే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా?
ఛాయాగ్రాహకుడిగా ఇది నా 50వ సినిమా. మొత్తం 40 మంది దర్శకులతో పనిచేశా. దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ వంటి వారితో పనిచేశా. వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఈ సినిమాకు ఉపయోగపడింది.
సినిమాటోగ్రాఫర్, డైరెక్షన్… ఈ రెండూ హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది?
నాకు నా టీమ్ చేసిన హెల్ప్ వల్లే ఇది సాధ్యమైంది. ఈ కథను అడాప్ట్ చేసుకున్నాక నేనే డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అనిపించింది.
శ్రీరామ్ గారి గురించి చెప్పండి
ఇందులో కథ పరంగా మిడిల్ ఏజ్డ్ పర్సన్ కావాలి. శ్రీరామ్ తో నాది పదేళ్ల అనుబంధం ఉంది. ఆయనతో తమిళ సినిమాలకు పనిచేశా. ఆయన ఏంటో నాకు తెలుసు. నేను వెళ్లి కథ చెప్పగానే ఆయనకు బాగా నచ్చింది.
మరి అవికా గోర్ గురించి
సినిమా కథ ప్రకారం హీరోయిన్ కు హోమ్లీ ఇమేజ్ ఉండాలి. మా ఫస్ట్ ఛాయస్ అవికా గోర్. కథ వినగానే వెంటనే ఓకే చేసింది. అవికా, శ్రీరామ్ మాత్రమే కాదు.. ప్రతీ పాత్రకు ఎవరు అనుకున్నామో వాళ్ళే కుదిరారు. కథకు కనెక్ట్ అవ్వడంతో ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదు.
దర్శకుడిగా చేస్తోన్న మరో సినిమా గురించి
జి. నాగేశ్వర రెడ్డి గారు కథ, స్క్రీన్ ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరించిన బుజ్జి ఇలా రా సినిమాను డైరెక్ట్ చేసాను. త్వరలో విడుదలకు రెడీ అవుతుంది.
దర్శకుడిగా కంటిన్యూ అవుతారా?
మంచి కథ వస్తే డైరెక్షన్ చేస్తాను. దర్శకుడిగా మూడో సినిమాకు రీమేక్ ను అనుకుంటున్నా.
751312 202790Hello. Great job. I did not expect this. This really is a excellent articles. Thanks! 566438
619994 252287Admiring the time and energy you put into your weblog and in depth information you offer. It is good to come across a blog every once in a whilst that isnt the same old rehashed material. Great read! Ive bookmarked your site and Im adding your RSS feeds to my Google account. 265688
61017 327059Hi, have you ever before asked yourself to write about Nintendo or PSP? 373449
939014 343127But a smiling visitor here to share the love (:, btw wonderful pattern . 82996