న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా అటు డొమెస్టిక్ మార్కెట్ లోనూ ఇటు ఓవర్సీస్ లోనూ అద్భుతమైన ఓపెనింగ్ ను అందుకుంది. అద్భుతమైన వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గిన మాట వాస్తవమే కానీ మరీ తీసికట్టుగా అయితే లేవు.
ఇక ప్రపంచవ్యాప్తంగా దసరా అద్భుతమైన రికార్డ్ అందుకుంది. 100 కోట్ల గ్రాస్ ను ఇప్పటివరకూ సాధించింది ఈ చిత్రం. ఇది ఒక మైలురాయి. మొదటి సినిమాతోనే ఈ రేంజ్ రికార్డ్ కొట్టి శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
మరోవైపు ఓవర్సీస్ లో కూడా దసరా కలెక్షన్స్ ప్రభంజనం కొనసాగింది. ఇప్పటివరకూ ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో ఫుల్ రన్ లో కచ్చితంగా 2 మిలియన్ మ్యాజికల్ మార్క్ ను ఈ చిత్రం అందుకోనుంది. అదే కనుక జరిగితే నాని ఫస్ట్ టైమ్ ఆ క్లబ్ లో అడుగుపెడుతున్నట్లే.