ప్రస్తుతం నాగ శౌర్య వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. తను నటించిన వరుడు కావలెను, లక్ష్య కూడా ప్లాపులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. నాగ శౌర్య నుండి వస్తోన్న తర్వాత చిత్రం కృష్ణ వ్రింద విహారి. పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం ఉండనుంది.
నిజానికి ఈ చిత్రం మే 20న విడుదల కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి మొత్తానికి లేటెస్ట్ అనౌన్స్మెంట్ చేసారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రాన్ని అనీష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేయగా షిర్లే సెటియా హీరోయిన్ గా నటించింది. ఐరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మహతి స్వర సాగర్ స్వరాలను సమకూర్చాడు. మరి ఈ చిత్రమైనా శౌర్యకు హిట్ ఇస్తుందేమో చూడాలి.
236660 441388This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for usually trying to drop the weight as properly within the have a significantly healthier lifetime. lose weight 538694