Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఇంటింటికీ వెళ్ళి ‘అది చూపించి’ ఓట్లడుగుతారేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

రాజకీయాలు ఎంతలా దిగజారపోయాయ్.? ఈ మాట పదే పదే అనుకుంటూనే వున్నారు జనం. అయినా, ప్రతిసారీ అంతకు మించిన లోతుల్ని ‘దిగజారుడుతనం’లో వెతుక్కుంటున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిలోనూ ఇదే తీరు.!

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని కాస్తా, యువజన శృంగార రసిక చిల్లర పార్టీగా మార్చేసిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో, అధినేత వైఎస్ జగన్ అంత ‘చూసీ చూడనట్టు’ ఎలా వ్యవహరిస్తున్నారన్నది పెద్ద మిస్టరీ.! గోరంట్ల మాధవ్ మీడియా ముందు మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వున్నాయ్. కానీ, చిత్రంగా వైసీపీ నాయకులు, అందునా కీలక పదవుల్లో వున్నవారు ఆయన్ని సమర్థిస్తున్నారు.

‘అది ఒరిజినల్ కాదు.. ఒరిజినల్ కావాలంటే, మీ ఇంటికి వచ్చి చూపిస్తా..’ అంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని తేలిగ్గా కొట్టి పారేయలేం. రేప్పొద్దున్న హిందూపురం నియోజకవర్గమంతా తిరిగి, ‘ఒరిజినల్’ చూపించి మరీ ‘నాకు ఓట్లేస్తారా.? వెయ్యరా.?’ అంటూ ఓటర్లను బూతులు తిట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

ఇప్పుడంటే గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి, నిన్న మొన్నటిదాకా టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలేంటి.? ముఖ్యమంత్రిని పట్టుకుని ఎంతటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నారాయన.? వైసీపీ నేతలు జోగు రమేష్, నారాయణ స్వామి తదితరులు మాట్లాడుతున్న మాటలేంటో చూస్తున్నాం. దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తోన్న టీడీపీ నేతల వ్యవహార శైలి కూడా చూస్తున్నాం.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన ప్రధాన రాజకీయ పార్టీల్లో అత్యంత కీలకమైన పదవుల్లో, బాధ్యతల్లో వున్న నాయకులు వ్యవహరిస్తోంటే, ఇదంతా చూడలేక సిగ్గుతో బిక్కచచ్చిపోతున్నారు సగటు ప్రజానీకం. అయినాగానీ, ‘డోన్ట్ కేర్..’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

ఈరోజు గోరంట్ల మాధవ్‌కి చంద్రబాబు మీదనో, లోకేష్ మీదనో మంటెక్కి.. వాళ్ళకి ‘ఒరిజినల్’ చూపిస్తానంటున్నారు. రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం సహజం. అలా పార్టీ మారే పరిస్థితి వస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ‘ఒరిజినల్’ చూపించరన్న గ్యారంటీ ఏంటి.? టీడీపీలో వుండి వైఎస్సార్‌ని తిట్టిన రోజా, వైసీపీలోకి వెళ్ళాక చంద్రబాబుని తిట్టడంలేదా.? ఇదీ అంతే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...