‘హీరోగా, క్రేజ్, ఇమేజ్ లో టాప్ పొజిషన్ ఉండి కూడా పవన్ కల్యాణ్ ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక్కడైతేనే కోట్లాదిమంది ప్రజలకు సాయం చేయగలనని భావించి వచ్చాడు. పవన్ కల్యాణ్ మా ఇంట్లో పుట్టాడు కాబట్టి ఎక్కువగా చెప్పలేకపోతున్నా’ అని నటుడు, నిర్మాత, జనసేన నేత నాగబాబు అన్నారు. పవన్ పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ ధియేటర్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీల్లో చేరుంటే మంత్రి పదవి వచ్చేది. కానీ.. ప్రజలకు మేలు చేయాలంటే తనకంటూ ప్రత్యేక వేదిక ఉండాలని భావించి పార్టీ పెట్టాడు. లగ్జరీగా జీవించే అవకాశాన్ని కూడా వదిలి ప్రజలే కుటుంబంగా భావించి జీవించడం అంత సులువైన విషయం కాదు. అది పవన్ చేస్తున్నాడు. ది రియల్ యోగి పుస్తకం చదివాను. పవన్ పై తనకున్న అభిప్రాయమే రాశారు. అందరికీ అర్ధమయ్యేలా ఉంది’ అని అన్నారు.
కార్యక్రమంలో తణికెళ్ల భరణి, దర్శకుడు బాబీ, నిర్మాత విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
738976 263984Real instructive and great anatomical structure of articles , now thats user pleasant (:. 409571
888484 383724Yay google is my king helped me to uncover this outstanding web site! . 160532
959723 625164Very educating story, saved your web site for hopes to read far more! 875124