Switch to English

మును‘గోడు’.! తెలంగాణలో పొలిటికల్ హీటు.! ఫైటు.!

91,319FansLike
57,013FollowersFollow

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడాలనుకున్న తర్వాతనే మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డికి గుర్తుకొచ్చింది. చాలాకాలంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో లేకుండా పోయారన్నది స్థానికంగా వినిపిస్తోన్న విమర్శ. అటు కాంగ్రెస్ పార్టీకీ, ఇటు మునుగోడు ప్రజలకీ అందుబాటులో లేకుండా గడచిన మూడున్నరేళ్ళుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం రాజకీయం చేసినట్టు.?

సరే, ఆ సంగతి పక్కన పెడితే.. ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖని స్పీకర్‌కి అందిస్తే, అది ఆమోదం పొందడం పెద్ద విషయమేమీ కాదు. సో, మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమైపోయినట్లే. అందరికన్నా ముందుగా కాంగ్రెస్ పార్టీ, మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించారు.

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయారనీ, ఎంగిలి మెతుకులకు ఆశపడి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళుతున్నారనీ, కన్న తల్లి లాంటి సోనియాగాంధీకి ఆయన వెన్నుపోటు పొడిచారనీ రాజగోపాల్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడిపోయారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

పదే పదే ‘అమ్మ సోనియాగాంధీ..’ అంటూ రేవంత్ రెడ్డి సంబోధించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇదే సోనియాగాంధీని గతంలో, అంటే టీడీపీ నేతగా వున్న సమయంలో ‘దెయ్యం’ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. రాజకీయం అంటేనే ఇంత.

ఇక, బీజేపీ కూడా మునుగోడు ఉప ఎన్నికకు సమాయత్తమవుతోంది. బీజేపీ నుంచే రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచినట్టే మునుగోడులో కూడా గెలుస్తామంటోంది బీజేపీ. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర సమితి సంగతేంటి.? ఆ పార్టీకంటూ కొన్ని వ్యూహాలున్నాయి. రాజగోపాల్ రెడ్డిని ఓడించి తాము గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్న భావనలో టీఆర్ఎస్ వుంది.

మొత్తంగా చూస్తే మునుగోడు చుట్టూ హై ఓల్టేజ్ పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఉప ఎన్నికలొస్తే, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన దరిమిలా, ఎన్నికల కోసం అధికార పార్టీ ఆ నియోజకవర్గానికి ప్రకటించే తాయిలాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ పాటను కాపీ చేశారంటూ కేరళకు చెందిన...

రాశి ఫలాలు: బుధవారం 23 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: కార్తీక అమావాస్య తె.4:46 వరకు తదుపరి పాడ్యమి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: విశాఖ రా.10:20 వరకు తదుపరి అనూరాధ యోగం:...

రాశి ఫలాలు: మంగళవారం 22 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: కార్తీక బహుళ త్రయోదశి ఉ.6:53 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: స్వాతి రా.11:44 వరకు తదుపరి విశాఖ యోగం:...

మంత్రి మల్లారెడ్డికి షాక్..! ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్..

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈరోజు తెల్లవారుఝాము నుంచి IT శాఖ దాడులు నిర్వహిస్తోంది. అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఇటివల నగరంలోని పలు ప్రముఖుల...

వావ్: 400 కోట్ల క్లబ్ లో కాంతారా

కేవలం 16 కోట్లతో కన్నడలో రూపొందిన ఒక చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం నిజంగా అమోఘం. నిజానికి ఆ సినిమాలో ఎవరూ కర్ణాటక దాటితే బయట తెలీరు. అయినా కానీ కాంతారా అద్భుత...