Switch to English

నితిన్ ‘భీష్మ’ మూవీ రివ్యూ & రేటింగ్

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 3.25/5

నటీనటులు: నితిన్, రష్మిక మందన్న..
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
దర్శకత్వం: వెంకీ కుడుములు
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
మ్యూజిక్: మహతి స్వర సాగర్
ఎడిటర్‌: నవీన్ నూలి
రన్ టైం: 2 గంటల 30 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020

‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న యంగ్ హీరో నితిన్ గ్యాప్ తీసుకొని ఆల్రెడీ ‘ఛలో’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేసిన సినిమా ‘భీష్మ’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ కంప్లీట్ ఎంటర్టైనర్ నేడు మహాశివరాత్రి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి పక్కా హిట్ కొడతానన్న ధీమాతో ఉన్న నితిన్ నమ్మకాన్ని ‘భీష్మ’ నిజం చేసిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

భీష్మ ఆర్గానిక్స్ ఎండి అయిన భీష్మ(అనంత్ నాగ్) తన కంపెనీకి సైరైన వారసుడి కోసం చూస్తున్నానని అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో మూవీ మొదలవుతుంది. మరోవైపు పెద్దగా పని లేని కుర్రాడు భీష్మ (నితిన్). భీష్మ అనుకోకుండా పోలీస్ కమీషనర్ అయిన సంపత్ రాజ్ దగ్గర పనిలో చేరతాడు. ఆ టైంలో సంపత్ కుమార్తె చైత్ర(రష్మిక మందన్న)తో ప్రేమలో పడతాడు. కానీ సంపత్ రాజ్ కి భీష్మ నరేష్ కొడుకు అని తెలియగానే ఇద్దరి మధ్య ఓ పెద్ద గొడవ. అప్పుడే నరేష్ భీష్మ తన కొడుకు కాదని భీష్మ ఆర్గానిక్స్ వారసుడని ప్రకటిస్తాడు. దాంతో కథ మలుపు తిరుగుతుంది. అప్పటి వరకూ భీష్మ ఆర్గానిక్స్ గురించి ఐడియా లేని భీష్మ ఎలా అక్కడికి వెళ్లి, అక్కడ ఉన్న సమస్యలని ఎలా పరిష్కరించాడు? అసలు నరేష్ చెప్పింది నిజమా? అబద్దమా? అనేదే మిగిలిన కథ.

తెర మీద స్టార్స్.. 

భీష్మ విషయంలో పెర్ఫార్మన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. తెరపై కనిపించిన ప్రతి యాక్టర్ అదరగొట్టేసారు. ఒకరికి మించి ఒకరు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక డీటైల్ గా చూస్తే.. నితిన్ సింపుల్ అండ్ లవర్ బాయ్ లుక్ లో కనిపించి నటనతో ఆధ్యంతం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా వెన్నల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ లతో కాంబినేషన్ సీన్స్ లో కామెడీ టైమింగ్ అదిరింది. ఇక రష్మిక మందన్న కూడా బబ్లీ బబ్లీ పాత్రలో సూపర్బ్ గా చేసింది. నితిన్ – రష్మిక పెయిర్ కూడా ఆన్ స్క్రీన్ వాటే వాటే బ్యూటీ అనేలా ఉంది.

వెన్నెల కిషోర్ ట్రాక్ మనల్ని మరోసారి కడుపుబ్బా నవ్విస్తుంది. సంపత్ రాజ్, నరేష్, బ్రహ్మాజీల బెస్ట్ పెర్ఫార్మన్స్ తో వీరి ట్రాక్స్ కూడా సూపర్బ్ గా పేలాయి. మెయిన్ గా ప్రీ ఇంటర్వల్ దగ్గర వచ్చే 30 నిమిషాలు భీభత్సంగా నవ్విస్తుంది. అలాగే సెకండాఫ్ లోని మొదటి 40 నిమిషాలు ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. నెగటివ్ షేడ్స్ లో జిష్హు షేన్ గుప్తా మరోసారి మెప్పించాడు. అలాగే సీనియర్ యాక్టర్ అనంత్ నాగ్ కీలక పాత్రలో అందరినీ మెప్పించాడు.

తెర వెనుక టాలెంట్.. 

భీష్మ కిఅన్ని డిపార్ట్మెంట్స్ సూపర్బ్ అవుట్ ఫుట్ ఇవ్వడం వలనే థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సాయి శ్రీరామ్ విజువల్స్ నయనానందకరంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా క్లాస్ గా, ప్రతి యాక్టర్ ని ఎంతో అందంగా చూపించడం వలన కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. సాగర్ స్వర మహతి అందించిన సింగల్, వాటే బ్యూటీ సాంగ్స్ విజువల్ గా కూడా సూపర్బ్, మిగతావి జస్ట్ ఓకే.. కానీ నేపధ్య సంగీతంలో మాత్రం ది బెస్ట్ ఇచ్చి సినిమాని మరో లెవల్ లో కూర్చో బెట్టాడు. నవీన్ నూలి ఎడిటింగ్ చాలా స్పీడ్ గా, క్లైమాక్స్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చాలా బాగుంది. స్పెషల్లీ సెకండాఫ్ లో పొలంలో వచ్చే ఫైట్ లో నితిన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ సూపర్బ్. వాటే బ్యూటీ సాంగ్ లో జానీ మాస్టర్ స్టెప్స్ అదుర్స్.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన వెంకీ కుడుముల విషయానికి వస్తే.. తన మొదటి సినిమాలానే ఇందులో కూడా తను స్ట్రాంగ్ అయిన కామెడీ అనే బ్రహ్మాస్త్రంతో అందరినీ మెప్పించాడు. రైటర్ తానే కావడం వలన స్టోరీ లైన్ చాలా చిన్నదైనప్పటికీ ట్రీట్మెంట్, కామెడీ అండ్ టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించేసాడు. తాను రాసుకున్న సీన్స్, కామెడీ అన్నీ వర్కౌట్ అయ్యాయి కానీ ఎప్పటిలానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి తేల్చేసాడు. కథలో హీరో – విలన్ కి గట్టి పోటా పోటీ సీన్స్ పెట్టే ఆస్కారం ఉన్నప్పటికీ సరిగా వాడుకోలేదు. చాలా సింపుల్ గా ఫినిష్ చేసేసాడు. కథ పరంగా చాలా సింపుల్ అయినప్పటికీ తన మార్క్ కామెడీ, లవ్ సీన్స్, టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించి చాలా మంది దాటలేని ద్వితీయ విజ్ఞాన్ని విజయవంతంగా దాటేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పెట్టిన ప్రతి రూపాయి తెరపై అందంగా కనిపించి, ఆహ్లాదాన్ని పంచిందని చెప్పాలి.

విజిల్ మోమెంట్స్:  

– నాన్ స్టాప్ కామెడీ ఉన్న ఫస్ట్ హాఫ్, స్పెషల్లీ మీమ్స్ డైలాగ్స్ సూపర్బ్
– సెకండాఫ్ మొదటి 40 నిమిషాల కామెడీ
– చూడ ముచ్చటైన నితిన్
– రష్మిక మందన్నల జోడీ మరియు పెర్ఫార్మన్స్
– వెంకీ కుడుముల ట్రీట్మెంట్ అండ్ డైరెక్షన్
– సూపర్ స్పీడ్ స్క్రీన్ ప్లే
– వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ కామెడీ సీన్స్
– మస్త్ వర్కౌట్ ఆయిన వన్ లైనర్స్

బోరింగ్ మోమెంట్స్:   

– వీక్ గా అనిపించే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్
– చాలా సింపుల్ స్టోరీ లైన్
– విలనిజంని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది
– అక్కడక్కడా బెటర్ గా ఉండచ్చు కదా అనే కొన్ని మోమెంట్స్

విశ్లేషణ: 

‘ఛలో’ తో మొదటి హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల రెండవ సినిమా ‘భీష్మ’తో ద్వితీయ విజ్ఞాన్ని విజయవంతంగా దాటి, చాలా రోజులుగా నితిన్ కోరుకుంటున్న అద్భుతమైన విజయాన్ని కూడా ఇచ్చాడు. ఈ చిత్ర టీం ప్రమోషన్స్ లో చ్ప్పినట్టుగానే థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకొని చాలా హాయిగా థియేటర్ బయటకి వస్తారు. నితిన్ – రష్మికల పెయిర్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, మంచి హీరోయిక్ మోమెంట్స్ భీష్మకి హైలైట్స్. ఫుల్ మీల్స్ పెట్టి చివరిలో తాంబూలం ఇవ్వకుండా డిజప్పాయింట్ చేసినట్టు క్లైమాక్స్ కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఫైనల్ గా సంక్రాంతి సినిమాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సినిమా ‘భీష్మ’.

ఇంటర్వల్ మోమెంట్: వాటే కామెడీ, నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యేలా ఉంది.

ఎండ్ మోమెంట్: మస్త్ నవ్వించాడు కానీ క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిందబ్బా..

చూడాలా? వద్దా?: పక్కాగా చూసి కడుపుబ్బా నవ్వుకోండి..

బాక్స్ ఆఫీస్ రేంజ్:

2020 సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ చేశాయి, ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పైసలు రాబట్టుకోలేకపోయాయి. నేడు విడుదలైన నితిన్ ‘భీష్మ’ మళ్ళీ బాక్స్ ఆఫీస్ కి పని పెట్టేసింది. చాలా రోజుల నుంచి ఓ మంచి సినిమా కోసం చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి మస్త్ ఎంటర్టైనర్ దొరికింది, అలాగే సినిమాలేవీ లేకపోయావడం వలన ఫుల్ థియేటర్స్ దొరికాయి, అన్నిటికీ మించి సూపర్ హిట్ మౌత్ టాక్ వస్తుండడంతో ‘భీష్మ’ సినిమా నితిన్ కెరీర్లో మరో బెస్ట్ హిట్ గా నిలిచే సినిమా అవుతుంది.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 3.25/5

సినిమా

చిరు – నాగ్ లకు ప్రధాని మోదీ అభినందనలు.!

కరోనా అనే మహమ్మారి వలన ప్రపంచం స్తంభించిపోయింది. ఇండియా మొత్తం లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే లాక్ అయ్యారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

అదే జరిగితే.. అమెరికా పరిస్థితేంటి.?

కరోనా వైరస్‌కి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రపంచమంతా చుట్టేసింది. చిన్న దేశాల్నీ, పెద్ద దేశాల్నీ సమానంగా వణికించేస్తోంది. పేదోడ్నీ, పెద్దోడ్నీ ఒకేలా ట్రీట్‌ చేస్తోంది. అగ్ర రాజ్యం అమెరికా పరిస్థితి...

ఆలూ లేదు సూలూ లేదు నాగరత్నమ్మ ఈమేనమ్మా!!

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు బెంగళూరు నాగరత్నమ్మ కథాంశంతో ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నట్లుగా సన్నిహితుల వద్ద అన్నాడట. ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి వర్క్‌ ప్రారంభం కాలేదని.. కనీసం ప్రీ...

సినీ కార్మికుల కోసం చిరు ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో షూటింగ్‌ అన్నీ కూడా క్యాన్సిల్‌ అయ్యాయి. షూటింగ్స్‌లో పాల్గొనే డైలీ లేబర్‌ పరిస్థితి జూనియర్‌ ఆర్టిస్టులు ఇంకా సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రతి...

ఆర్జీవీ కరోనా పాట : వైరస్ కంటే భయంకరం

పబ్లిసిటీ, అటెంషన్ సీకింగ్ అనేవి వైరస్ కంటే భయానకమైనవి. ఈ మత్తులో పడిపోతే ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అందుకే టిక్ టాక్ అనే యాప్ లో...

కరోనా టెర్రర్‌: ఏపీ తాజా లెక్క 87.. అసలేం జరుగుతోంది.?

ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యమైన రీతిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ లెక్క 87కి చేరుకుంది. నిన్న రాత్రి 44 వద్ద వున్న ఈ లెక్క, ఈ రోజు ఉదయం...