Switch to English

మోడీ వర్సెస్ కెసిఆర్.. ఇద్దరు పట్టు వదలడం లేదు..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ తెలంగాణలో దాదాపుగా 80శాతానికి పైగా సీట్లు గెలుచుకుంది. అదే హావాను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని అనుకున్న బీజేపీకి భంగపాటు ఎదురైనా సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో కెసిఆర్ షాక్ అయ్యారు. ముఖ్యంగా నిజామాబాద్ లో కెసిఆర్ తనయ కవిత పరాజయం పాలవడం అందరిని ఆందోళన కలిగించింది.

రాష్ట్రస్థాయి ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఈ విషయం కెసిఆర్ కు తెలుసు. కానీ, ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారని అనుకున్నారు. 17 స్థానాలకు గాను 16 చోట్ల విజకేతనం ఎగరేద్దామని అనుకుంటే కేవలం 9 చోట్ల మాత్రమే విజయం సాధించారు. అప్పటి నుంచి బీజేపీ వర్సెస్ తెరాస లా మారిపోయింది. కేంద్రం నిర్వహించే మీటింగ్ లలో కేసీఆర్ పాల్గొనడం లేదు. కొన్ని నెలల క్రితం నీతిఆయోగ్ మీటింగ్ లో కూడా కేసీఆర్ పాల్గొనకుండా తనయుడు కేటీఆర్ ను పంపించారు.

కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణాలో బీజేపీ చాపకింద నీరులా క్రమంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడమే కాకుండా, ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నిలలో బలమైన ప్రభావం చూపింది. ఇది కేసీఆర్ కు మింగుడు పడటం లేదు. ఎలాగైనా బీజేపీని ఎదగకుండా చూడాలని పథకాలు రచిస్తున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో సిఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దానికి అనుకూలంగా ఓటు వేసి కేంద్రానికి తమ నిరసన తెలియజేయాలన్నది కేసీఆర్ ప్లాన్. అటు బీజేపీపై ఎంతటి ఒత్తిడి వచ్చినా సిఏఏ పై వెనక్కి తగ్గేది లేదని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అనుకోవచ్చు.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్ ల సపోర్ట్.!

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ ప్రమోషనల్...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

ప్రభాస్‌ 21 : బాబోయ్‌ దీపిక అంత డిమాండ్‌ చేసిందా?

ప్రభాస్‌ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్‌ 21వ...

ఫ్లాష్ న్యూస్: యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ...