Switch to English

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా కేజ్రీకి తెలుసు

ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులపై ఎలా విరుచుకుపడినా.. వారిపై తీవ్ర విమర్శలు చేసినా.. ఎన్నికలు ముగిసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడాలి. ఈ విషయంలో అవసరమైతే రాజకీయ ప్రత్యర్థులను సైతం కలుపుకొని పోవాలి. అదే ప్రజాస్వామ్యానికి అసలు సిసలు నిర్వచనం. కానీ దీనిని అనుసరించే నాయకులు చాలా అరుదుగా ఉంటారు.

ఇలాంటివారిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించిన కేజ్రీ.. ఆదివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి స్నేహహస్తం అందించారు. ఢిల్లీలో పాలన సజావుగా సాగేందుకు కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నామని, ఇందుకు మోదీ ఆశీస్సులు కావాలని పేర్కొన్నారు.

ఎన్నికలు ముగిసినందున రాజకీయాలతో పనిలేదని, ఎన్నికల్లో తనను విమర్శించినవారందరినీ క్షమించేశానని, ఇక సంక్షేమంపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నిజానికి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయన్ను ఉగ్రవాదితో పోల్చింది. కానీ కేజ్రీవాల్ మాత్రం తన సంక్షేమ పథకాలనే నమ్ముకుని హ్యాట్రిక్ కొట్టారు. 70 సీట్లలో ఏకంగా 62 స్థానాలు కొల్లగొట్టి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకోగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తర్వాత కేజ్రవాల్ ను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తాజాగా పాలన సజావుగా సాగేందుకు మోదీ ఆశీస్సులు కోరుతూ కేజ్రీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీకి సీఎంగా ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల సీఎంలకు ఉన్నన్ని అధికారాలు కేజ్రీకి ఉండవు. అక్కడి పలు అంశాలు కేంద్రం కనుసన్నల్లోనే ఉంటాయి.

మరోవైపు లోక్ సభ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల నాలుగు నెలల సమయం ఉంది. ఈ సమయంలో ఎలాంటి రాజకీయాలూ అవసరం లేదు. అందుకే పాలన సక్రమంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీ స్నేహహస్తం అందించినట్టు చెబుతున్నారు. ఇక్కడ కూడా ఆయన హూందాతనం ప్రస్పుటమవుతోందని, ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా కేజ్రీకి తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

వైజాగ్ గ్యాస్ లీక్స్: వైఎస్ జగన్ కి వెంకటాపురం గ్రామస్తుల డిమాండ్స్.!

దాదాపు పది రోజుల క్రితం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోగా, పలువురు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. వైఎస్ జగన్ వెంటనే రియాక్ట్ అయ్యి బాధితులందరికీ భారీగా వీరారాలు...

పూరి నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హీరో ఎవరు?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైలాగ్స్ ఎలా అయితే బుల్లెట్స్ లా ఉంటాయో, సినిమాలు కూడా అంతే స్పీడ్ గా ఉంటాయి. అంతకన్నా స్పీడ్ గా సినిమా షూటింగ్స్ ని కూడా ఫినిష్...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉండి ఉంటారు....

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...