ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1 పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చ జరగాలంటూ సోమవారం పట్టు పట్టారు.ఈ క్రమంలో స్పీకర్ పోడియంను వారు చుట్టుముట్టారు. స్పీకర్ వారిస్తున్నప్పటికీ సదరు ఎమ్మెల్యేలు మాత్రం వెనక్కి తగ్గలేదు. టిడిపి ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ పోడియం వైపు విసరడంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధికార వైసిపి ఎమ్మెల్యేలు సైతం స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య టిడిపి ఎమ్మెల్యేల మీదకు దూసుకెళ్లారు. ఆ తర్వాత కొండేపి టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభా సమయాన్ని వృధా చేస్తున్నారంటూ స్పీకర్ అసహన వ్యక్తం చేస్తూ సభను వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా సాగకుండా టిడిపి ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే వీళ్ళు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి స్పీకర్ పై దాడి చేశారని అడ్డుకోబోయిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పైనా దాడి చేశారని ఆరోపించారు.
మరోవైపు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలే తొలత తమపై దాడికి దిగారంటూ టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్పీకర్ సాక్షిగా తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్నారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇటువంటి దారుణం ఎప్పుడూ జరగలేదని..ఆదివారం నుంచే ఇందుకు ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు ఎమ్మెల్యేలపై దాడిని ఖండించారు. అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజుగా మిగిలిపోతుందని.. ఇలాంటి మచ్చ తెచ్చిన సీఎం గా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారన్నారు.అది శాసనసభ కాదు..కౌరవ సభ అంటూ మండిపడ్డారు.
430577 213749This really is wonderful content material. Youve loaded this with useful, informative content material that any reader can understand. I enjoy reading articles that are so quite well-written. 872667