Keerthy Suresh: ‘మహానటి’ కీర్తి సురేష్ మంచి మనసు చాటుకుంది. నాచురల్ స్టార్ నాని- కీర్తి కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దసరా’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెన్నెల అనే పాత్రలో కీర్తి కనిపించనుంది. ఈ సందర్భంగా దసరా టీంను కీర్తి సర్ప్రైజ్ చేసింది. చిత్రీకరణలో తనకు సహకరించిన టెక్నీషియన్లకు గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చిందట. సుమారు 130 మంది కి కాయిన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిందన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తి రూపంలోనే కాదు మనసులో కూడా బంగారం అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం విషయానికొస్తే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణలోని గోదావరిఖని సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్, పూర్ణ, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నాని.. ‘ధరణి’ అనే యువకుడిగా ఊర మాస్ లుక్ తో కనిపించనున్నారు. కీర్తి కూడా డి గ్లామరస్ లుక్ లోనే సందడి చేయనుంది. ‘సర్కారు వారి పాట’ తర్వాత కీర్తి చేస్తున్న తెలుగు సినిమా ఇదే. నాని-కీర్తి కాంబినేషన్లో 2017 లో వచ్చిన ‘నేను లోకల్’ సూపర్ హిట్ అవడంతో ‘దసరా’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
I feel this is among the such a lot important information for
me. And i’m glad studying your article. However want to observation on some common things, The website
taste is ideal, the articles is really great : D.
Good task, cheers
I for all time emailed this blog post page to all my friends, as if like to
read it next my links will too.
34643 894305Genuinely clear internet web site , thanks for this post. 995584