Switch to English

మంత్రి రోజా కొత్త రాజ్యాంగం: ఓడిపోతే చీర కట్టుకోవాలె.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

చీర కట్టుకున్నోళ్ళంతా ఓడిపోయినోళ్ళేనా.? మంత్రి అయ్యాక వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్యే రోజా కొత్త రాజ్యాంగం రచించినట్టున్నారు. కొడుకు నారా లోకేష్‌ని ఎమ్మెల్యేని చెయ్యలేకపోయారు గనుక, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చీర కట్టుకోవాలట. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు గనుక నారా లోకేష్ చీర కట్టుకోవాలట.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు నడుస్తున్నాయి.? ఓ మహిళ అయి వుండి, తెలుగు సంప్రదాయ వస్త్రధారణ విషయంలో మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే చీరని ఇంతలా అవమానించడమా.? మంత్రి రోజా దృష్టిలో చీర కట్టుకోవడమంటే ఓడిపోయినట్టే. అది కూడా ఆమె చీరకట్టులో వుండగానే తీర్మానించేశారు. ఏం దౌర్భాగ్యం పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.

రాజకీయాల్లో రాజకీయ విమర్శలు చేసేది ఇలాగేనా.? టీడీపీ అధినేత చంద్రబాబుని వైసీపీ నేత హోదాలో రోజా ఎలాగైనా విమర్శించుకోవచ్చుగాక. కానీ, ఆమె ఇప్పుడు మంత్రి. మహిళా లోకం సిగ్గుపడేలా, పురుషులు చీరకట్టుకోవాలని రోజా ఉచిత సలహా ఇవ్వడమేంటి.?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. వైసీపీలోనూ 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. వాళ్లందరి చేతా చీర కట్టించి జనంలోకి రోజా తీసుకు రాగలరా.? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.

కొడుకుని గెలిపించుకోలేనందుకు చంద్రబాబు చీరకట్టుకోవాలట. మరి, తల్లిని గెలిపించుకోలేని వైఎస్ జగన్ కూడా అదే పని చేయాలా.? అని టీడీపీ నుంచి ప్రశ్న వస్తే, దానికి మంత్రి రోజా ఏం సమాధానమిస్తారు.? మంత్రి అవకముందే రోజా ఒకింత పద్ధతిగా మాట్లాడేవారేమో.! మంత్రి పదవి అంటే, నోటికొచ్చింది మాట్లాడటానికి తప్ప, పని చేయడానికి కాదని రోజా, అమర్‌నాథ్ తదితరులు నిరూపిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...