మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకూ రెండు సినిమాలకు కలిసి పనిచేసారు. ఈ రెండూ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ఏమి కాదు. అయినా కూడా ఈ రెండు సినిమాలు అందరికీ తెగ నచ్చేసాయి. అవే అతడు, ఖలేజా. ఈ రెండు చిత్రాలు కల్ట్ స్టేటస్ ను సంపాదించాయి. ఈరోజుతో ఖలేజా విడుదలై 10 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా మేకింగ్ వీడియోను జత చేస్తూ మహేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నాయి. “నన్ను నటుడిగా కొత్తగా ఆవిష్కరించిన సినిమా ఖలేజా. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. నా క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు థాంక్స్. అతి త్వరలో మా కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నా” అని తెలిపాడు మహేష్. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం పక్కా అన్న విషయం అర్ధమవుతోంది.
నిజానికి ఎప్పటినుండో వీరిద్దరూ కలిసి పనిచేయాలి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల కారణంగా అది జరగట్లేదు. అయితే ఎట్టకేలకు ఇది జరిగేలా ఉంది. అయితే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చేయాల్సి ఉంది. దాని తర్వాత రాజమౌళితో సినిమా లైన్లో ఉంది. మరోవైపు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టాలి. చూడాలి మరి మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పటికి వర్కౌట్ అవుతుందో.
Khaleja turns 10!! Reinvented myself as an actor!! Will remain a special one!! All thanks to my good friend and the brilliant Trivikram… Looking forward to our next… very soon 😎😎😎 pic.twitter.com/X1aPwTGpEF
— Mahesh Babu (@urstrulyMahesh) October 7, 2020
561391 232042Hey there! Good post! Please inform us when we will see a follow up! 855052
457191 234280Hello Guru, what entice you to post an post. This post was really interesting, especially since I was looking for thoughts on this topic last Thursday. 720851