సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి చెందుతున్నారు. మహేష్ తన తల్లి ఇందిరమ్మ ఎంత అటాచ్డ్ అన్నది చాలా మందికి తెలుసు. పలు ఇంటర్వ్యూలలో తన తల్లి తనకు దైవంతో సమానమని తెలిపిన విషయం తెల్సిందే.
ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు ఆమె వద్దకు వెళ్లి, తన చేతి కాఫీ తాగితే ఉన్న టెన్షన్ మొత్తం పోయేదని పలుమార్లు రివీల్ చేసాడు మహేష్. ఇదిలా ఉంటే ఇందిరా దేవి ఈరోజు ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గత నెల రోజులుగా ఇందిరా దేవి ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది.
రీసెంట్ గా తన 28వ చిత్రం షూటింగ్ ను మొదలుపెట్టిన మహేష్, రెండో షెడ్యూల్ కు బ్రేక్ దొరికింది. చివరి రోజుల్లోనే ఇందిరా దేవి వద్దే మహేష్ ఎక్కువ సమయం గడిపినట్లు తెలుస్తోంది.