SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయ్యింది. మరో వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. అయితే ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు సినిమా కోసం లుక్ మార్చే పనిలో పడ్డాడు. జక్కన్న సలహా మేరకు గడ్డం మరియు జుట్టు పెంచుతున్నాడు.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు పై త్వరలో ఫోటో షూట్ ను చేయబోతున్నారు. పాత్ర కు సంబంధించిన మేకోవర్ తో ఫోటో షూట్ ఉంటుందని తెలుస్తోంది. ఆ ఫోటో షూట్ స్టిల్స్ నుంచి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఫోటోలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. జక్కన్న ఆ దిశగానే ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. 2026లో సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్ చేయాలని మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిని కోరుతున్నారు. మరి జక్కన్న వ్యూహం ఏంటో తెలియాల్సి ఉంది.
Thanks a bunch for sharing this with all people you really realize what you’re speaking
about! Bookmarked. Please additionally visit my website =).
We could have a hyperlink alternate agreement between us
I’m not sure where you’re getting your information, but great topic.
I needs to spend some time learning much more or
understanding more. Thanks for excellent info I was looking for this info for my mission.