Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు మేకర్స్. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..
‘పదేళ్ళ క్రితం బంజారహిల్ల్స్ లో ఎక్కడ చూసినా నవదీప్ కనిపించేవాడు. అలా ఉండాలనుకున్నా. నేనూ ఒక్కడినే ట్రిప్స్ వెళ్ళిపోతా. ఏ ప్రదేశంలో కూర్చుని, ఎలా ఎదగాలనుకున్నానో కొన్నేళ్ళకి అక్కడే షూటింగ్ చేశాను. అనుకున్న స్థానానికి చేరుకుంటున్నా. నవదీప్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా’నని అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ.. ‘విభిన్నమైన కథ కావడంతో గడ్డం చేసుకోవద్దు, జుట్టు పెంచు, బాడీ బిల్డ్ చేయమని చెప్పారు దర్శకుడు. ఏడాదిగా అదే పనిలో ఉంటే.. ‘అసలు నీకేం కావలిరా?’ అని అడిగారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. ‘ప్రేమ యాత్ర’ పేరుతో సినిమా ట్రైలర్ వేర్వేరు ఊళ్లలో రిలీజ్ ప్లాన్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుంద’న్నారు. కార్యక్రమంలో మిర్చి కిరణ్, డైరెక్టర్ అవనీంద్ర చిత్ర యూనిట్ దితరులు పాల్గొన్నారు.