కొన్ని సినిమాలతోనే లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ముఖ్యంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది మొదలుపెట్టి యువతలో మాంచి క్రేజ్ ను సంపాదించాడు. ఈ కోవలో కొన్ని నెలల క్రితం విడుదలైన లియో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. లోకేష్ సినిమాల్లోనే వీకెస్ట్ చిత్రంగా నిలిచింది.
లోకేష్ ఎప్పుడూ విమర్శల పరంగా ఓపెన్ గా ఉంటాడు. లియో విషయంలో కూడా వచ్చిన విమర్శల్ని అర్ధం చేసుకున్నట్లు చెప్పాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాలో మైనస్ అయిందని ఒప్పుకున్నాడు. దీనికి కారణం కూడా తెలిపాడు లోకేష్.
సినిమా మొదలుపెట్టినప్పుడే విడుదల తేదీ ప్రకటించడం మైనస్ అయిందని అన్నాడు. దీనివల్ల ప్రొడక్షన్ లో హడావిడి పడాల్సి వచ్చిందని, ఇకపై తాను చేయబోయే ఏ సినిమాకైనా విడుదల తేదీ చాలా ముందుగా ప్రకటించనని, మొత్తం అంతా అయ్యాకే చూసుకుని దాన్నిబట్టి చెబుతానని అన్నాడు. అయితే లియో మంచి గుణపాఠమే నేర్పింది లోకేష్ కి.