అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో మంచి ఆరంభమే దక్కింది. దాన్నుండి పునాది వేసుకుని జాన్వీ కపూర్ కొన్ని మంచి సినిమాలు చేసింది. అయితే జాన్వీ కపూర్ కు టాప్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు పెద్దగా రాలేదు. హీరోయిన్స్ కు టాప్ లెవెల్ కు చేరాలంటే మాస్ కమర్షియల్ సినిమాలు చేయాల్సిందే.
అయితే ఆ అవకాశం జాన్వీ కు తెలుగు నుండి వచ్చింది. ఎన్టీఆర్ తో దేవరలో చేస్తోంది ఈ భామ. తెలుగు చిత్రమే అయినా ఇది కూడా ప్యాన్ ఇండియన్ లెవెల్లో విడుదలవుతోంది. సో హిందీలో కూడా ప్రేక్షకులు జాన్వీని చూస్తారు.
ఇలాంటి సినిమాల ప్రాముఖ్యత అర్ధం చేసుకున్న జాన్వీ, ఇకపై సౌత్ ప్రధానంగా తెరకెక్కే ప్యాన్ ఇండియన్ చిత్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని భావిస్తోందిట. ఇక్కడ రెమ్యునరేషన్లు భారీగానే ఉంటాయి. దానికి మించి పాపులారిటీ భీభత్సంగా పెరుగుతుంది.