Switch to English

లాక్‌డౌన్‌ ఎత్తివేత తప్పదుగానీ.. వాట్‌ నెక్స్‌ట్‌.?

పేరుకే సడలింపు.. ప్రజా రవాణా, సినిమా హాళ్ళు యధాతథంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయంతే. జోన్ల పేరిట కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి, లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్‌ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. మరి, కరోనా భయం తగ్గిందా.? అంటే.. లేదనే సమాధానం చెప్పాలి. దేశంలో పరిస్థితులు రోజు రోజుకీ అధ్వాన్నంగా తయారవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కాస్త బెటర్‌గా వుందంతే. రేపే ఆంధ్రప్రదేశ్‌ 2000 క్లబ్‌లో చేరబోతోంది. తెలంగాణకి ఆ క్లబ్‌లో చేరడానికి చాలా సమయం వుందని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా అదుపు చేయలేని స్థాయికి వెళ్ళింది. తమిళనాడు, ఢిల్లీ తదితర చోట్ల కూడా ఇవే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

నిజానికి, మే 3 తర్వాత వెసులుబాట్లు కల్పించడంతో జనాలు రోడ్ల మీదకు విచ్చలవిడగా వచ్చేస్తున్నారు. దానికి తోడు మద్యం అమ్మకాల దెబ్బకి కరోనా వైరస్‌కి అదనపు బలం వచ్చి పడ్డట్లయ్యింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో మారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలు చెబుతారు.. ఆ తర్వాత ప్రధాని కొన్ని కీలక నిర్ణయాలూ తీసుకుంటారు. సో, కేంద్రం తదుపరి నిర్ణయం ఏంటి.? అన్న ఉత్కంఠ జనంలో కన్పించడం సహజమే.

ఇందులో ఆలోచించడానికేమీ లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేత దిశగా మరికొంత వెసులుబాటు కల్పించనుంది కేంద్రం. ఆదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. నిజానికి, సడలింపుల ప్రక్రియ మొదలవడంతోనే లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లుగా భావించాలనే చర్చ మేధావి వర్గంలో విన్పిస్తోంది. ‘ఇన్నాళ్ళూ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది..’ అన్నది ఆ మేధావి వర్గం అభిప్రాయం.

నిజమే మరి, అన్ని పనులూ మానుకుని, తమ జీవితాల్ని నాశనం చేసుకున్న జనం, ప్రభుత్వాల ఖజానా కక్కుర్తితో మద్యం షాపుల్ని తెరిస్తే ఏమనుకోవాలి.? ఇంతలా జనం త్యాగాలు చేసినా, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోయాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో ప్రజల తప్పిదాలూ వున్నా, కొందరి తప్పిదాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం.. వెరసి, దేశంలో కరోనా వ్యాప్తి ఆగకపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

కోలుకుంటున్న జనం.. కోరలు చాస్తున్న కరోనా

జనసాంద్రత ఎక్కువగా వున్న భారతదేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని అడ్డుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసినా.. ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే...

ఎన్టీఆర్‌కు అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యాన్స్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చారు. ట్విట్టర్‌లో తిరుగులేని రికార్డును ఎన్టీఆర్‌కు కట్టబెట్టి నందమూరి ఫ్యాన్స్‌ సత్తా చాటారు. నేడు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ఆయన...

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

జగన్‌ సర్కార్‌కి ఝలక్‌: డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి.!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ...

దేవుడి భూముల అమ్మకం.. దేవుడే రక్షించుకోవాలేమో..

అసలు హిందూ దేవాలయాలకు పాలక మండళ్ళు ఎందుకు.? దేవాలయాల్ని పరిపాలించడమా.? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటివి కాదు. కానీ, ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. దేవాలయాల్లోనే ప్రసాదాల అమ్మకాలు.. అదీ అధికారికంగా జరుగుతుంటాయి....