Switch to English

మాస్కుల హామీ మడత పడిందా?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున 16 కోట్ల మాస్కులు ఉచితం పంపిణీ చేస్తాం. ఈ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాం. తద్వారా ఈ లాక్ డౌన్ కాలంలో వారికి రోజుకు రూ.500 వరకు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. – ఇదీ నెల రోజుల క్రితం ఏపీ సర్కారు ఘనంగా చేసిన ప్రకటన. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

మాస్కుల తయారీ ప్రారంభించి దాదాపు నెలరోజులు కావొస్తున్నా, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎవరికీ అవి అందలేదు. రోజుకు గతనెల 19నాటికి 7.28 మాస్కులు తయారు కాగా, ఆ తర్వాత రోజుకు 30 లక్షల మాస్కులు తయారుచేసేలా కార్యాచరణ రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కన 16 కోట్ల మాస్కులు పూర్తి కావడానికి 53 రోజుల సమయం అవసరం. ఆ లెక్కన ఈ రోజు వరకు దాదాపు ఆరు కోట్ల మాస్కుల పంపిణీ పూర్తి కావాలి.

కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 3.86 కోట్ల మాస్కులు మాత్రమే కుట్టడం పూర్తయి మండల కేంద్రాలకు డిస్పాచ్ అయ్యాయి. ఈ లెక్కన 16 కోట్ల మాస్కులు కుట్టి పంపిణీ చేయాలంటే కనీసం రెండు నెలలపైనే పడుతుంది. మరోవైపు ఇప్పటివరకు పూర్తయిన మాస్కుల్లో కూడా ప్రజలకు పంపిణీ చేసింది చాలా తక్కువ.

మండల కేంద్రాలకు సరిపడా లెక్కన మాస్కులు రాకపోవడంలో వాటి పంపిణీ ప్రహసనంగా మారింది. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే సమస్యలు తప్పవనే ఉద్దేశంలో చాలాచోట్ల వాటి పంపిణీ ప్రారంభించలేదు. కొన్ని చోట్ల కుటుంబానికి ఒకటి లేదా రెండు మాస్కులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతోపాటు అధికారుల అలసత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 63వేల మంది మహిళలు ఈ మాస్కుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. వీరి సంఖ్యను పెంచడం ద్వారా మాస్కుల తయారీని వేగవంతం చేసే అవకాశాలున్నా.. అధికారులు ఆ దిశగా దృష్టి సారించడంలేదు. దీంతో మాస్కుల పంపిణీ హామీ ఆశించిన విధంగా నెరవేరడంలేదు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్కుల పంపిణీ ఎంత త్వరగా పూర్తిచేస్తే దాని వల్ల అంత ఉపయోగం ఉంటుంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

‘ఆర్ఆర్ఆర్’ టీంకి బిగ్ షాకిచ్చిన దిల్ రాజు.!

దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుషితం'. లాక్ డౌన్...

యజమాని పట్ల కుక్కలు చూపించే విశ్వాసంకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం

మనిషి ఎన్నో జంతువులను ప్రేమగా పెంచుకుంటాడు. కాని వాటిలో కుక్క మాత్రమే అత్యంత విశ్వాసంను కనబర్చుతుందని గతంలో ఎన్నో సందర్బాల్లో నిరూపితం అయ్యింది. తన యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క అంటూ పదుల...

కరోనా అలర్ట్‌ : ముంబయిలో ఆ పరిస్థితి రానే వచ్చేసింది

ఇండియాలో కరోనా ప్రారంభం అయిన సమయంలో చాలా మంది ఇక్కడ కరోనా విజృంభిస్తే ట్రీట్‌మెంట్‌ చేసేందుకు కనీసం బెడ్స్‌ కూడా ఉండవు. కరోనా పేషంట్స్‌ రోడ్ల మీద ఉంచి ట్రీట్‌ మెంట్‌ చేయాల్సి...

భయపెడుతున్న ‘నిసర్గ’ తుఫాన్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్‌తో మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్‌...