Switch to English

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: బెగ్గింగ్‌ నుంచి బ్లాక్‌మెయిలింగ్‌ దాకా! -2

తెలుగు సినీ పరిశ్రమ అంతా ఓ వెబ్‌సైట్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న విషయం విదితమే. ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఓ ‘ముసలోడి’ వ్యవహారంపై యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నిన్న మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశాడు కూడా. ఇప్పుడు ఆ ‘ముసలోడి’ వ్యవహారంపై సినీ మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సదరు వెబ్‌సైట్‌లో కొన్నాళ్ళ క్రితం చేరిన ఆ ‘ముసలోడు’ తాను పనిచేస్తున్న సంస్థ పేరుని అడ్డంపెట్టుకుని చేసిన అరాచకాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

ఓ యువ హీరో ఈ ‘మాయలోడి’ మాటల్ని నమ్మి ‘లకారాలు’ కోల్పోయాడట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అతగాడి బాధితులు చాలామందే వున్నారంటూ హీరోలు, దర్శకులు, పలువురు నిర్మాతల పేర్లను బాధితుల లిస్ట్‌లో చేర్చుతున్నారు కొందరు సినీ జర్నలిస్టులు. ఆఫ్‌ ది రికార్డ్‌గానే ప్రస్తుతం ఈ వ్యవహారమంతా ఆనోటా ఈ నోటా బయటకు పొక్కుతున్నప్పటికీ, సినీ పరిశ్రమ పెద్దలు ఇంకాస్త ఫోకస్‌ పెడితే, అన్ని వివరాలూ బయటకొచ్చేస్తాయని అంటున్నారు. ‘నీ సినిమా రిలీజవుతోంది కదా.. అడిగింది ఇస్తే, రేటింగ్‌ పెరుగుతుంది.. లేకపోతే, నాశనం..’ అంటూ శాపనార్థాలు కూడా పెట్టేస్తాడట ఈ మాయలోడు. ‘ఆ నోటికి భయపడి చాలామంది అడిగినంత సమర్పించుకుంటారు’ అని ఓ అప్‌కమింగ్‌ హీరో తన సన్నిహితుల వద్ద వాపోయాడట.

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: ‘ముసలోడు’.. వసూళ్ళలో మామూలోడు కాదు.! – 1

గత కొద్ది కాలంగా సినీ మీడియాలో ఆ మాయగాడి గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్నా, ‘మనకెందుకులే’ అని చాలామంది అతన్ని ఉపేక్షించినట్లు తెలుస్తోంది. బెగ్గింగ్‌ నుంచి బ్లాక్‌మెయిలింగ్‌దాకా ఏదైనా ఆ ‘ముసలోడు’ చేయగలడన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో బలంగా విన్పిస్తోన్న అభిప్రాయం.

వెబ్‌ రాబందు: ఒక్కడి కక్కుర్తి.. ఎంతమందికి శాపమో.!

సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది ప్రకటనల విషయంలో. ఇకపై, సినీ ప్రకటనలు ఇచ్చే సమయంలో కొన్ని ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సి వుంటుందనీ, లాక్‌డౌన్‌ తర్వాత సరికొత్త నిబంధనల్ని తెరపైకి తెస్తామనీ తెలుగు సినీ పరిశ్రమ స్పష్టం చేస్తోంది. అన్ని నిర్మాణ సంస్థలూ ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా తమ అంగీకారాన్ని తెలుపుతున్నట్లే కన్పిస్తోంది.

ఒకే ఒక్క వెబ్‌సైట్‌.. ఇప్పుడు మొత్తం వెబ్‌ మీడియాకి తలనొప్పి తెచ్చిపెట్టేలా వుంది. ‘గాసిప్స్‌ని మేమూ ఎంజాయ్‌ చేస్తాం.. అయితే అవి ఎవర్నీ కించపర్చనంతవరకే బావుంటాయి..’ అని సినీ ప్రముఖులు ఎంత చెబుతున్నా, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసి, జుగుప్సాకరమైన కథనాలతో సదరు వెబ్‌సైట్‌ నిస్సిగ్గుగా పాపులారిటీని పెంచుకుంది.

సినీ పరిశ్రమకు ఓపిక నశించింది ఈ దుష్ప్రచారం విషయంలో. అందుకే, మొత్తంగా వెబ్‌సైట్లకు ప్రకటనలు ఇవ్వకూడదన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే సదరు వెబ్‌సైట్‌, ఆ వెబ్‌సైట్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న పత్రికకు మాత్రమే ప్రకటనలు ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పనిచేస్తున్న వెబ్‌సైట్లు.. ముందు ముందు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందడం సహజమే. కానీ, ఎలాంటి వివాదాలకూ ఆస్కారమివ్వకుండా నడుస్తున్న వెబ్‌సైట్ల మీద సినీ పరిశ్రమకు అభ్యంతరాలేమీ లేవనే భావన పలువురు సినీ ప్రముఖుల మాటల్లో విన్పిస్తోంది.

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: ‘ముసలోడు’.. వసూళ్ళలో మామూలోడు కాదు.! – 1

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

శ్రీదేవి ఇంట కరోనా పాజిటివ్ నమోదు

హాలీవుడ్ వారితో పోల్చితే ఇండియన్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తక్కువే. ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు కూడా...