Switch to English

తెలంగాణలోనూ ‘లిక్కర్‌’.. మందుబాబులకి నో ‘ఫికర్‌’.!

తెలంగాణలో మద్యం అమ్మకాలకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరుచుకుంటాయి.. సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచే మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ‘క్యూ’ కట్టేశారు. అయితే, భౌతిక దూరం (ఫిజికల్‌ డిస్టెన్స్‌) పాటించేలా మద్యం దుకాణాల వద్ద ఖచ్చితమైన ఏర్పాట్లు చేశారు.

పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరవడం ద్వారా, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో మందుబాబులు అటు వైపు వెళ్ళి వస్తున్నారనీ, తద్వారా కరోనా వ్యాప్తి తెలంగాణలో పెరిగే అవకాశం వుంటుందనీ, ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ మద్యం దుకాణాలు తెరవాల్సి వస్తుందని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మద్యం దుకాణాల పునఃప్రారంభంపై స్పష్టతనిచ్చారు.

అయితే, ఏ ఒక్క మద్యం షాపు వద్ద అయినా జనం గుమికూడినట్లు కన్పిస్తే, వెంటనే ఆ షాప్‌ బంద్‌ చేయించడం జరుగుతుందనీ కేసీఆర్‌ హెచ్చరించారు. ‘నో మాస్క్‌.. నో లిక్కర్‌’ పాలసీని అమలు చేస్తున్నామనీ, శానిటైజర్స్‌ కూడా మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్‌.

మరోపక్క, మద్యం ధరల్ని 11 నుంచి 16 శాతం వరకు పెంచుతున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ‘50 శాతం, 75 శాతం పొరుగు రాష్ట్రాల్లో పెంచుతున్నారు. మనం అలా చేయం. అత్యధికంగా 16 శాతం మాత్రమే పెంచుతున్నాం. చీప్‌ లిక్కర్‌పై 11 శాతమే పెరుగుతుంది’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. అయినాగానీ, ప్రస్తుత కరోనా భయానక పరిస్థితుల్లో మద్యం దుకాణాల్ని తెరవడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది సాధారణ ప్రజానీకం నుంచి.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, మద్యం అమ్మకాలతో మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుండడం గమనార్హం. ప్రార్థనా స్థలాల్లోకి ప్రజల్ని అనుమతించకపోవడమనేది కొనసాగుతుందని, విద్యా సంస్థల మూసివేత కొనసాగుతుందనీ చెబుతూ, మద్యం దుకాణాలకు అనుమతినివ్వడం ఆశ్చర్యకరమైన నిర్ణయమే. కానీ, పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ముప్పుతో పోల్చితే, తెలంగాణలో మద్యం దుకాణాలు తెరవడం ద్వారా కలిగే ముప్పు తక్కువే.. అన్న ప్రభుత్వ వాదనని పూర్తిగా కొట్టేయలేం కదా.!

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

భారత్ – ఆస్ట్రేలియా బంధాన్ని బలోపేతం చేస్తున్న ‘సమోసా’

ఒక సమోసా రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సమోసా.. ఏంటి దేశాల మధ్య స్నేహం ఏంటి.. అనుకుంటున్నారా. ఇది నిజమే. భారతీయ చిరుతిండి (స్నాక్) సమోసా ఆస్ట్రేలియా ప్రధానిని...

అనుమతులు ఇవ్వటమే ఆలస్యం..’లొకేషన్’లో ఉంటాను.!

తమిళ నటుడు మరియు నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీని స్టార్ గా మార్చిన బ్లాక్ బస్టర్ సూపర్ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా రిలీజై సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా...

జస్ట్‌ ఆస్కింగ్‌: రాజకీయాల్లో ఓడితే ఇంట్లో కూర్చోవాల్సిందేనా.!

రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజం. అర శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన పార్టీలుంటాయి. ‘మీకూ మాకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా ఎంతో తెలుసా.? చాలా చాలా తక్కువ.! మీదేమీ గొప్ప విజయం...

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

సినిమా షూటింగ్స్ పునఃప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సినీ ప్రముఖులెవరూ తనను పిలవలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘మంత్రితో కలిసి అందరూ భూములు పంచుకుంటున్నారా..’ అంటూ ఆయన చేసిన...

దారుణం: వలస కూలీల బస్సు బోల్తా – 33మందికి గాయాలు.!

ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ...