కారు.. కేసీయార్ సారు.. తెలంగాణ సర్కారు.! ఇదీ నిన్న మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు నినదించిన తీరు.! ఇకపై ఆ నినాదం మారేలా వుంది. విమానమెక్కి హస్తినకు పోదాం.. అని తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్తేజ పరచబోతోంది. ఢిల్లీ పీఠమెక్కాలంటే, సొంతంగా విమానం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోందట. అంటే, జాతీయ స్థాయిలో రాజకీయం చేయాలంటే, సొంతంగా విమానం వుండాలన్నమాట.!
కాంగ్రెస్ పార్టీకి సొంతంగా విమానం వుందా.? బీజేపీకి సొంతంగా విమానం వుందా.? కాస్త ఆలోచించాల్సిన విషయాలే ఇవి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలంటే, దేశ ప్రజల్ని ఆలోచింజేసేలా రాజకీయ ప్రణాళికలుండాలిగానీ, ప్రత్యేక విమానమెందుకు.? ఏం చేసినా, కాస్త గ్రాండ్ లుక్‌లో వుండాలన్నది బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్దేశ్యం కావొచ్చు.
ఎక్కడికంటే అక్కడికి.. ఎప్పుడనుకుంటే అప్పుడు.. వెళ్ళి వచ్చేందుకోసం ప్రత్యేక చార్టర్డ్ విమానం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోందిట. ఈ క్రమంలోనే సుమారు 80 కోట్లు వెచ్చించి ప్రత్యేక ఛార్టర్డ్ విమానాన్ని కొనుగోలు చేస్తారట. విజదశమి తర్వాత ఏ క్షణంలో అయినా, తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఆ ప్రత్యేక విమానం ఎగురుకుంటూ వచ్చేస్తుందట.
అంత సొమ్ములు తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర వున్నాయా.? అంటే, లేకనేం.. చాలానే వున్నాయ్. కానీ, ఆ సొమ్ముల నుంచి పైసా కూడా తీయాల్సిన పనిలేదు. మంత్రులు జస్ట్ నిధుల వేటలో భాగంగా నెత్తి మీద ఓ మట్టి గంప ఎత్తుకుంటే చాలు లక్షలు వచ్చి పడతాయ్. బజ్జీల దుకాణంలో నాలుగు బజ్జీలేస్తే లక్షలు వచ్చేస్తాయ్. టీఆర్ఎస్ అధినేత కేసీయార స్వయంగా రంగంలోకి దిగితే, ఒక్క రోజులో కోట్లు సంపాదించేయగలరు.. అంత ఘనమైన కూలీ దొరుకుతుంది రాజకీయాల్లో.
అయినా, కొత్త విమానం కొనాలన్న ఆలోచన కేసీయార్ సారుకి ఎందుకు వచ్చినట్లు.? కారు మీద బోరు కొట్టినట్లుంది.. అందుకే, గాల్లో తిరగడమే తేలిక.. అనే భావనకు వచ్చినట్లున్నారు. విమానాల్లో తిరగాలంటే, అందుబాటులో బోల్డన్ని చార్టర్డ్ విమానాలున్నాయ్ కదా.! వాటిని అద్దెకు తీసుకోవాలంటే, అన్ని సమయాల్లోనూ వీలు కాదట. అదండీ సంగతి.
322186 167738Keep up the fantastic piece of work, I read couple of blog posts on this internet web site and I believe that your website is real intriguing and has lots of fantastic data. 737025
24541 937179I enjoy seeking by way of and I conceive this internet site got some truly beneficial stuff on it! . 833942