దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగానే కదా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడిని తెచ్చి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మీద కుటుంబ పరంగా తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చి.. కడప ఎంపీగా అప్పట్లో కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్ పోటీ చేశారని చెబుతుంటారు. ఈ క్రమంలో బాబాయ్ మీద వైఎస్ జగన్ చెయ్యి చేసుకున్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఈ కోణం కూడా వుండి వుండొచ్చు..’ అని టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపించడం చూస్తూనే వున్నాం.
2024 ఎన్నికలకు సంబంధించి పలువురు వైసీపీ సీనియర్ నేతలు, తాము కాకుండా తమ వారసుల్ని రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఈ లిస్టులో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే వున్నారట. వారి వారి వారసులు ఇప్పటికే రంగంలోకి దిగేశారు.
‘మా వారసులే వచ్చే ఎన్నికల్లో పోటీలో వుంటారు..’ అంటూ పార్టీ శ్రేణులకి ఆయా నేతలు సంకేతాలు కూడా పంపేశారు. ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే వారి వారసులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ‘వర్క్ షాప్’లో పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్న విషయం విదితమే.
‘వారసులు రంగంలోకి దిగితే తప్పేంటి.? అంతిమంగా అధినేత నిర్ణయం తీసుకుంటారు..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా సెలవిచ్చారు. ‘వారసుల్ని ప్రమోట్ చేసుకోండి.. కానీ, మీరే పోటీలో నిలబడండి..’ అని సీనియర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెగేసి చెప్పారు.
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి వుండగానే, ఫామ్‌లో వుండగానే.. రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు వైఎస్ జగన్. అలాంటప్పుడు, మంత్రుల వారసులెందుకు రంగంలోకి దిగకూడదు.? వైఎస్ కుటుంబం నుంచి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వివేకానందరెడ్డి తదితరులు యాక్టివ్ పాలిటిక్స్‌లో వున్నారు.
మరి, ఇదే రూల్.. వైసీపీలో సోకాల్డ్ సీనియర్ నేతలకీ వర్తించాలి కదా.? వారసులు ఇప్పుడే వద్దని వైఎస్ జగన్ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇది అర్థం కాక సీనియర్లు తలపట్టుక్కూర్చుంటున్నారు. ‘దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. మేం ఫామ్‌లో వున్నప్పుడే, మా వారసులకి రాజకీయంగా దారి చూపెట్టాలి.. లేకపోతే కష్టం..’ అని భావిస్తోన్న సోకాల్డ్ సీనియర్లు, అవసరమైతే అధినేతకు షాక్ ఇవ్వాలనే నిర్ణయంలో కూడా వున్నట్లు తెలుస్తోంది.
Hello, I enjoy reading through your article post. I like to
write a little comment to support you.
Wonderful article! We are linking to this particularly great content on our website.
Keep up the great writing.
Spot on with this write-up, I actually feel this web site needs a
great deal more attention. I’ll probably be returning to see
more, thanks for the information!
This website was… how do I say it? Relevant!! Finally I have found something that helped me.
Appreciate it!
340736 709116I cant say that I completely agree, but then again Ive never actually thought of it quite like that before. Thanks for giving me something to think about when Im supposed to have an empty mind whilst trying to fall asleep tonight lol.. 57387