గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడిన ఇంగ్లీషుపై ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్ కు తమిళ సినీ నటి కస్తూరి మద్దతు పలికారు. ‘అమెరికాలో అక్కడి యాక్సెంట్ లో మాట్లాడితేనే అర్ధమవుతుంది. నేనూ అమెరికాలో ఉన్నాను. నాకు ఆ విషయం తెలుసు. మన ఇండియన్ యాక్సెంట్ అక్కడ అర్ధం కాదు. ఎన్టీఆర్ సరిగ్గానే మాట్లాడారు. దీనిని ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు’ అని ఇటివల ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
అయితే.. మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడే ఇంగ్లీషుపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నిజమైన ప్రయత్నానికి.. ఫేక్ అటెంప్ట్ కి చాలా తేడా ఉంది. హైదరాబాద్ లో అమెరికన్ యాక్సెంట్ లో తెలుగు మాట్లాడితే ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. నేను తెలుగును తమిళ యాసలో మాట్లాడితే ఎలా ఉంటుంది. తెలుగును తెలుగులోనే మాట్లాడితేనే బాగుంటుంది.. అమెరికన్ యాక్సెంట్ అవసరం లేదు. ఈ విషయంలో వీరిద్దరినీ పోల్చకూడద’ని అన్నారు.
585195 87829You completed certain great points there. I did looking on the subject matter and found most persons will go together together with your weblog 665373