Switch to English

సినిమా రివ్యూ: కల్కి

91,429FansLike
56,274FollowersFollow

నటీనటులు : రాజశేఖర్ , ఆదా శర్మ, నందిత శ్వేతా, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా, సిద్దు ,పూజిత పొన్నాడ, నాజర్ తదితరులు ..
రేటింగ్ : 2. 75 / 5
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
కెమెరా : దాశరధి శివేంద్ర
కథ : సాయి తేజ
స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్స్:  విలీ
నిర్మాత : సి కళ్యాణ్
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

వరుస పరాజయాలతో డీలా పడ్డ యాంగ్రీ యాంగ్ మెన్ రాజశేఖర్ కెరీర్ అయిపొయింది అనుకున్న సమయంలో గరుడవేగ సినిమాతో మళ్ళీ సత్తా చాటాడు హీరో రాజశేఖర్. దాదాపు ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన అయనకు ఆ తరువాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి .. అయితే సెలెక్టీవ్ గా కథలను ఎంచుకోవాలని డిసైడ్ ఆయిన రాజశేఖర్ ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడు. అయిందే తడవుగా సినిమా మొదలు పెట్టేసారు. కల్కి పేరుతొ తెరెకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. అటు సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్వెస్టి గేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ కల్కి ఎవరో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపుర్ అనే గ్రామంలో కథ మొదలవుతుంది. 80 వ దశకంలో జరిగిన ఈ కథలో ఆ ఊరి ఎంఎల్ఏ ( అశుతోష్ రాణా ) అరాచకాలు దారుణంగా ఉంటాయి. శేఖర్ బాబు ( సిద్దు జొన్నలగడ్డ ) అనే ఎంఎల్ ఏ తమ్ముడు దారుణ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసిన వాళ్ళను చంపే వరకు వదిలిపెట్టేది లేదని ఎం ఎల్ ఏ రగిలిపోతూ ఊరిలో కల్లోలం సృష్టిస్తూ .. ఆ వూరిలోని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ .. అందరిని తన బానిసలుగా మార్చుకుంటాడు. అయితే శేఖర్ బాబు హత్యను విచారించేందుకు ఆ ఊరికి వస్తాడు డి ఐ జి కల్కి ( రాజశేఖర్ ). శేఖర్ బాబు హత్యను ఎలా సాల్వ్ చేసాడు. అసలు ఆ ఊవూరికి కల్కికి ఉన్న సంబంధం ఏమిటి ? అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

అప్పట్లో పోలీస్ పాత్రలంటే ఒక్క రాజశేఖర్ కె సూట్ అవుతాయి అనిపించేలా అదరగొట్టిన రాజశేఖర్ .. ఈ సినిమాలో అదే పోలీస్ అధికారిగా చాలా నీరసంగా కనిపించడం ప్రేక్షకులను కాస్త నిరాశ కలుగుతుంది. ఎందుకంటే పోలీస్ గా అయన ముఖంలో పౌరుషం .. ఎనర్జీ ఈ సినిమాలో కనిపించలేదు. ముఖంలో ఏమాత్రం ఎనర్జీ లేదు .. కళ్ళు లోపలి పీక్కుపోయినట్టుగా అనిపించాడు. కథలో విషయం ఉంది కాబట్టి .. రాజశేఖర్ అలా ఉన్నా కూడా జనాలు చూసేలా చేసింది. సినిమాలో ఆయనపై బిల్డప్ ఇచ్చిన షాట్స్ ఎక్కువ. నటించడానికి పెద్దగా స్కోప్ ఏమి లేదు .. ఇక్కడ కావలసింది హీరోయిజం. దాన్ని బాగానే మేనేజ్ చేసాడు రాజశేఖర్. ఇక హీరోయిన్ గా ఆదా శర్మ గురించి పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. ఆమె పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేదు .. హీరోకు హీరోయిన్ కావాలి కాబట్టి ఆమెను పెట్టారా అన్నట్టుగానే ఉంటుంది. ఇక కథలో కీ రోల్ పోషించింది నందిత శ్వేత. కథ మలుపుతిరిగే పాత్రలో నందిత చక్కగా చేసింది. ఇక విలన్ గా అశుతోష్ రాణా అదరగొట్టాడు. శేఖర్ బాబు పాత్రలో సిద్దు సూపర్. మిగతా పాత్రల్లో ఎవరికీ వారు బాగానే చేసారు. అయితే నాజర్ కు మాత్రం అయన స్థాయికి చెందిన పాత్ర కాదని చెప్పాలి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోగా మార్కెట్ కోల్పోయిన రాజశేఖర్ .. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ గరుడవేగ ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చింది. దాంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ అదే స్టాండర్డ్ ను మైంటైన్ చేస్తూ మరో కొత్త తరహా కథను ఎంచుకోవడం బాగుంది. కానీ అయన ముఖంలో నీరసాన్ని తగ్గించి మునుపటిలా యాంగ్రీ యాంగ్ మేన్ ఛాయలు కనిపిస్తే ఇంకా బెటర్.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమాకు టెక్నీకల్ విషయాల్లో చాలా కేర్ తీసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా శ్రవణ్ భరద్వాజ్ సంగీతం. ఆర్ ఆర్ అదరగొట్టాడు. చాలా సన్నివేశాలు ఆర్ ఆర్ తో మరో స్థాయిలో నిలబడ్డాయి. కొన్ని చోట్ల ఓవర్ గా అనిపిస్తుంది, అయినా మ్యూజిక్ మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత దాశరధి శివేంద్ర కెమెరా వర్క్ గురించి చెప్పేది ఏముంది .. ప్రతి ఫ్రేమ్ కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంది. 80 వ దశకాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో బాగానే కష్టపడ్డారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి చెప్పాలంటే ఆ ! సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ప్రశాంత్ వర్మ .. కొత్తగా ట్రై చేయాలన్న ప్రయత్నమే ఈ సినిమా. అతను ఓ కథను సరికొత్తగా చెప్పాలని చేసిన ప్రయత్నం బాగుంది కానీ .. స్క్రీన్ ప్లే మాత్రం చాలా కన్ఫ్యూజ్ గా తయారైంది. కథలో చాలా ప్లాష్ బ్యాక్ సన్నివేశాలు వచ్చి కథను ఇంకా కన్ఫ్యూజ్ గా మారుస్తాయి. సన్నివేశాల రూపకల్పన విషయంలో దర్శకుడు కేర్ తీసుకుంటే బాగుండేది.

విశ్లేషణ :

సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కేర్ తీసుకున్న దర్శకుడు కథనం విషయంలో కన్ఫ్యూజ్ అవ్వడంతో కథ కంగాళీగా మారింది. రాజశేఖర్ కు సరిపోయే కథతో చేసిన ప్రయత్నం బాగానే ఉంది. అయితే రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. హీరోయిజం ఎలివేషన్ ఓవర్ గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథలో ఇంటెన్సిటీ బాగున్నప్పటికీ కథనంలో అనేక ట్విస్టులు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తాయి. కథ అనేక మలుపులు తిరగడం. ఒక్కో ట్విస్ట్ కు ఒక్కో ట్విస్ట్ పై రీవీల్ అవడం కూడా ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ పెట్టేస్తుంది. కథను నేరేట్ చేసే విధానంలో దర్శకుడు సింపుల్ గా తేల్చాల్సిన విషయాన్నీ అనేక మలుపులతో అనవసర హంగామా చేసాడనిపిస్తుంది. కథలో పెద్దగా ఫజిల్స్ లేకున్నప్పటికీ అవి ఉన్నాయేమో అనిపించాడు దర్శకుడు. దాంతో పాటు కథ కూడా నెమ్మదిగా సాగడం కొంత అసహనానికి గురైనా .. కథలో మంచి పట్టుంది కాబట్టి .. కల్కి పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. రాజశేఖర్ నటన, ఆసక్తి కలిగించే కథ, కొన్ని టెక్నీకల్ అంశాలు కలిసి కల్కి ని ఆకట్టుకునేలా చేసాయి.

ట్యాగ్ లైన్ : కల్కి .. కొంతవరకు ఒకే !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

మరో స్టార్‌ కపుల్‌ విడాకులు తీసుకోబోతున్నారా?

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంత మరియు కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు విడాకులు తీసుకున్నారు...

బిగ్‌ బాస్ 6 గీతూ రాయల్‌ గురించి ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గలాట గీతూ రాయల్ జీవితం ప్రత్యేకమైంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు విజయవంతమైన జీవితాన్ని గడుపుతోంది. టిక్ టాక్ స్టార్ గా...

అన్‌స్టాపబుల్‌ కోసం విజయవాడకి బాలయ్య

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో ప్రోమో అక్టోబర్‌ 4న రాబోతున్న విషయం తెల్సిందే. ప్రోమో విడుదల కార్యక్రమంను విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి...

రాశి ఫలాలు: బుధవారం 28 సెప్టెంబర్ 2022

పంచాంగం  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ తదియ రా.1:50 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ చవితి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: చిత్త ఉ.7:33...

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో కి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తనకు...