Switch to English

సినిమా రివ్యూ : బ్రోచేవారెవరురా

91,316FansLike
57,002FollowersFollow

నటీనటులు : శ్రీవిష్ణు, సత్యాదేవి,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేద థామస్, నివేద పేతురేజ్, శివాజీ రాజా, ఝాన్సీ , బిత్తిరి సత్తి, తదితరులు ..
రేటింగ్ : 3 / 5
సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్
సంగీతం : వివేక్ సాగర్
కెమెరా : సాయి శ్రీరామ్
ఎడిటింగ్ : రవితేజ గిరజాల
నిర్మాత : విజయ్ కుమార్ మన్యం
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మేకర్స్ కూడా కొత్త తరహా కథలను ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకులు సరికొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తూ యూత్ ని టార్గెట్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో అలాంటి చిత్రాల పరంపర మొదలైంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు బిన్నంగా .. వినోదమే ప్రధానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మద్యే మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వివేక్ ఆత్రేయ రెండో ప్రయత్నంగా చేసిన చిత్రమే బ్రోచేవారెవరురా. టీజర్ నుండి అందరిలో ఆసక్తి రేపిన ఈ సినిమా ఎలా ఉందొ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

విశాల్ ( సత్యదేవ్ ) దర్శకుడు కావాలన్న కోరికతో సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ సందర్బంగా ఓ నిర్మాతను ఒప్పించినా, అయన ఓ స్టార్ హీరోయిన్ తో ఈ సినిమా చేద్దాం ఆమెను ఒప్పించు అని నిర్మాత చెప్పడంతో విశాల్ స్టార్ హీరోయిన్ అయిన షాలిని ( నివేద పేతురేజ్ ) కు కథ చెప్పే ఛాన్స్ దొరుకుతుంది. ఆ కథను చెప్పే క్రమంలో మరో కథ ఓపెన్ అవుతుంది. ఒక ఊరిలో కాలేజీ ప్రిన్సిపాల్ కూతురు మిత్ర ( నివేద థామస్ ) నాట్యకళాకారిని. అయితే ఆమె నాట్యం చేయడం ఇష్టం లేని ఆమె తండ్రి తాను పనిచేస్తున్న కాలేజ్ లోనే ఆమెను చేర్పిస్తాడు. చదువంటే అస్సలు ఇష్టం లేని నివేద ఆ కాలేజీ లో చేరుతుంది. అదే కాలేజీలో చదివే ముగ్గురు మిత్రులు .. రాహుల్ ( శ్రీ విష్ణు ), రాఖీ ( ప్రియదర్శి ), రాంబో ( రాహుల్ రామకృష్ణ ) మంచి స్నేహితులు. చదువు తప్ప అన్ని పనులు చేస్తుంటారు. ఆ తరువాత మిత్రతో రాహుల్ పరిచయం పెంచుకుంటాడు. తనకు డాన్స్ అంటే ఇష్టమని చదువు అస్సలు ఇష్టం లేదని మిత్ర ద్వారా తెలుసుకున్న రాహుల్ ఎలాగైనా మిత్రను మంచి డాన్సర్ చేయాలనీ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఓ కిడ్నాప్ లో ఇరుక్కుంటారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మిత్ర కిడ్నాప్ కు గురవుతుంది. ఆ కిడ్నాప్ చేసింది ఎవరు ? అసలు ఈ ముగ్గురికి దర్శకుడు అవ్వాలనుకున్న విశాల్ కు మధ్య సంబంధం ఏమిటి ? ఆ కిడ్నాప్ నుండి వీరు ఎలా బయటపడ్డారు అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాలో నటన పరంగా అందరు బాగా చేసి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు అయినప్పటికీ అతనితో సమానంగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ల పాత్రలు ఉండడం నిజంగా గొప్ప విషయం. శ్రీ విష్ణు ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ల కామెడీ బాగుంది. కామెడీ కోసం ప్రత్యేకంగా ట్రాక్ లా కాకుండా కథ నేరేషన్ లోనే కామెడీ పండించే ప్రయత్నం చేసారు. ఇక మరో హీరో సత్యదేవ్ దర్శకుడు అవ్వాలన్న లక్ష్యంతో ఉన్న కుర్రాడిగా చక్కగా నటించాడు. స్టార్ హీరోయిన్ షాలిని పాత్రలో నివేద పేతురేజ్ చక్కగా చేసింది. ఇక కథకు కీ రోల్ అయిన మిత్ర పాత్రలో నివేద థామస్ నటన బాగుంది. ఇప్పటికే నటిగా మంచి పేరు తెచ్చుకున్న నివేద థామస్ మరోసారి చక్కని పాత్రతో మెప్పించింది. మిగతా పాత్రల్లో ఝాన్సీ, శివాజీ రాజా, అజయ్ ఘోష్ లు ఉన్నంతలో బాగా చేసారు. అయితే బిత్తిరి సత్తి పాత్రను మాత్రం సరిగ్గా ఉపయోగించుకోలేదు.

టెక్నీకల్ హైలెట్స్ ;

మెంటల్ మదిలో సినిమాతో సున్నితమైన ప్రేమ కథను చెప్పి మెప్పించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సారి మరో భిన్నమైన కథను ఎంచుకున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా సాగిన ఈ సినిమా ఆద్యంతం కామెడీగా సాగుతూ ఆకట్టుకుంది. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. లైట్ మ్యూజిక్ తో కథను నడిపించాడు. అలాగే పాటలకు స్కోప్ లేకపోవడంతో ఆర్ ఆర్ పైనే గట్టిగ ఫోకస్ పెట్టి మెప్పించే ప్రయత్నం చేసాడు. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి బాగుంది. సరికొత్తగా ఫోటోగ్రఫి ఉండేలా ప్లాన్ చేసాడు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. ఫైనల్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎంచుకున్న కథ .. కథనం ఆసక్తిగా సాగింది. పెద్దగా హంగామా లేని కథను .. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే తో ప్రజెంట్ చేసాడు దర్శకుడు. ఇలాంటి కథల్లో ఆసక్తి కలిగించే అంశం ఏది తక్కువైనా ఫలితం మరోలా ఉంటుంది . ఆ విషయంలో దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. ప్రేక్షకుడి మెదడుకు పదును పెడుతూ .. ఒక్కో సస్పెన్స్ ని ఆవిష్కరిస్తూ కథను నడిపించాడు. ట్విస్టులన్నీ ఆసక్తికరంగా సాగడం విశేషం. ఇక కథనం విషయంలో కూడా ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా మొదటికే మోసం వస్తుంది, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

ఇలాంటి కథలను రెండు గంటలపాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం నిజంగా కత్తిమీద సాము లాంటిదే. క్రైం థ్రిల్లర్ కు కామెడీ జోడిస్తూ .. ఎక్కడా సీరియస్ నెస్ కలగకుండా కథ ఆహ్లాదంగా సాగిపోయేలా కేర్ తీసుకున్నాడు దర్శకుడు. నిజానికి ఇలాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే కథలో కొత్తదనం, దాన్నీ అదే ఇంటెన్స్ తో నడపడం ఇక్కడ వర్కవుట్ అయ్యింది. రెండు కథలను మిక్స్ చేస్తూ .. ఆ రెండింటికి సరైన లింక్ పెట్టి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కథ విషయంలో ముందు ముందు ఏమి జరుగుతుందో ఊహించడం కొంచెం కష్టమే. దర్శకుడి ఇంటిలిజెన్స్, కథ .. నటీనటుల పెర్ఫార్మెన్స్ లాంటి అంశాలు హైలెట్ గా సాగిన బ్రోచేవారెవరురా .. ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ కలిగిస్తుంది. కథ ఫస్ట్ హాఫ్ లో చాలా ఫన్ తో సాగుతుంది .. సెకండ్ హాఫ్ తో అసలు కథ మొదలై ప్రేక్షకులకు కట్టి పడేస్తుంది. మొత్తానికి కిడ్నాప్ డ్రామాగా లైట్ కామెడీ కోటింగ్ తో వచ్చిన బ్రోచేవారెవరురా ఓ మంచి ప్రయత్నం అని చెప్పాలి.

ట్యాగ్ లైన్ : .. బ్రోచేవారు .. అందరూ !!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

ఎక్కువ చదివినవి

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందా.?

ఎవర్ని చూసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడాలి.? 2019 ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన జనసేన పార్టీని చూసి, ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఎందుకు...

నారా లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు..! కార్యకర్తల ఆనందం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పర్యటన ఖరారైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈమేరకు నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 27...

జంట నగరాల్లో బ్లడ్ కొరత.. మెగా బ్లడ్ బ్రదర్స్ చేయూత..

ఇటీవలి కాలంలో హైద్రాబాద్ జంట నగరాల్లో రక్త నిధుల కొరత ఏర్పడి.. పేద రోగులు రక్తం దొరకక పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మెగాభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు...

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్...